close
Choose your channels

కల్కీ ఆశ్రమంలో ముగిసిన ఐటీ రైడ్స్.. షాకింగ్ నిజాలివీ

Sunday, October 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కల్కీ ఆశ్రమంలో ముగిసిన ఐటీ రైడ్స్.. షాకింగ్ నిజాలివీ

‘కల్కి’ పేరుతో చిత్తూరు జిల్లాలో వెలిసిన ‘కల్కి భగవాన్‌’ ఆశ్రమంలో గత నాలుగురోజులుగా ఐటీ అధికారులు జరిపిన సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో నమ్మలేని షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. తవ్వేకొద్దీ నగదు, నగలు, వజ్రాలు, ఆదాయంలో చూపని ఆస్తులు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. కల్కి భగవాన్‌ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి, వ్యాపారాలు చేస్తున్నట్లు తేలింది. కాగా సోదాల అనంతరం ఐటీ అధికారులు మీడియాకు ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.

ఇవీ దొరికింది..!

రూ. 5 కోట్లు విలువచేసే వజ్రాలు

రూ. 26 కోట్లు విలువ చేసే 88 కేజీల బంగారం

రూ.40.39 కోట్ల నగదుతో పాటు 18 కోట్ల విదేశీ కరెన్సీ

మొత్తం 93 కోట్ల విలువ చేసే బంగారు, నగదు స్వాధీనం

409 కోట్ల రూపాయల సంబంధించి రసిదులను ఇంకా దొరకలేదు.

కలానికి కల్కీ పోటు

స్టూడియో ఎన్ పెట్టుబడిపై ఆధారాలు

.. ప్రచారానికి ఓ ఛానల్ కావాలనుకున్నారు. స్టూడియో ఎన్ కొనుగోలు చేశారు. అయితే ఐటీ రైడ్స్ ప్రారంభమైన తర్వాత కల్కి దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లి ఇంతవరకూ బయటికి రాలేదు. రూ.409 కోట్లకు రశీదులు లేవు. మొత్తం 93 కోట్ల బంగారం, నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూ దందాలకు సంబంధించిన 1182 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. చాలా వరకు బినామీలు ఉండటం గమనార్హం. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలు వెలుగులోకి రావాలంటే కల్కీ వేలుముద్రలు పాస్ వర్డ్‌గా ఉండటంతో అధికారులు సంబంధిత హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు.

ఇక్కడా.. నొక్కుడే..:

హైదరాబాద్, మణికొండలోని పంచవటి కాలనీలో స్టూడియో ఎన్ ఛానల్ ఉంది. ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాస రావు దగ్గర నుంచి 2014లో ‘ ఏకం కల్కి ఆధ్యాత్మిక ‘ కేంద్రం వారు ఈ ఛానల్ కొనుగోలు చేశారు. దేశ వ్యాప్తంగా ‘ ఏకం కల్కి ఆధ్యాత్మిక ‘ కేంద్రాలు, ఆఫీసులలో జరుగుతున్న ఐటీ సోదాల్లో భాగంగా స్టూడియో ఎన్ లో కూడా సోదాలు జరిగాయి. సిఇఓ రూపంలో ఓ సుందరాంగికి బాధ్యతలు కట్టబెట్టారు. అంతే జర్నలిస్టులకు జీతాలు ఇవ్వకుండా మెడబట్టి గెంటేశారు. అయితే ఆ పాత్రికేయులకు కోట్లలో జీతాలు ఇచ్చినట్లు లెక్కల్లో పక్కాగా చూపారు. ఐటీ దాడుల సందర్భంగా ఈ విషయం వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ ఛానల్ మూతపడింది. అయితే ఇక్కడ నొక్కిన సొత్తు ఓ మహిళా సీఇఓ బాగానే వెనుకేసుకుందని తెలిసింది.

ఏమేం దొరికాయంటే...!

అధికారులు చేపట్టిన తనిఖీల్లో క్యాంపస్‌-3లో భారీగా విదేశీ నగదు, బంగారాన్ని గుర్తించారు. ఈ మేరకు కల్కి భగవాన్‌ కుమారుడు కృష్ణ నాయుడు, కోడలు ప్రీతినాయుడు, ట్రస్ట్‌ నిర్వహకుడు లోకేష్‌ దాసాజీని అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. స్వదేశీ, విదేశీ భక్తుల ద్వారా భారీ ఎత్తున విరాళాలు సేకరించి.. వందల ఎకరాలు, కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు నిర్ధారించారు. ఈ దాడుల అనంతరం అధికారులు తాము స్వాధీనం చేసుకున్న వివరాలను వెల్లడించారు. అందులో రూ.5 కోట్ల విలువ చేసే వజ్రాలు, 26 కోట్లు విలువ చేసే 88 కేజీల బంగారం, 40.39 కోట్ల నగదుతో పాటు 18 కోట్ల విదేశీ కరెన్సీ ఉంది. మొత్తం 93 కోట్ల విలువ చేసే బంగారు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. రూ.409 కోట్లకు సంబంధించి రసీదులు లేవని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కల్కి ఆశ్రమంలో కీలక ప్రతాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సోదాల్లో వందల కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. ఈ విచారణలో వందల కోట్ల విలువైన అక్రమాస్తుల సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. బినామీల పేరుతో వేల ఎకరాల భూముల అమ్మకాలు జరిగినట్లు గుర్తించారు. అయితే అజ్ఞాతంలో ఉన్న దంపతులు ఎప్పుడు బయటికొస్తారో.. ఐటీ అధికారులు ఏం తేలుస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.