పెద్ద‌లు నేర్పిన నీతి నిజాయితీకి క‌ట్టుబ‌డి ఎదిగానుః న‌ట్టికుమార్‌

  • IndiaGlitz, [Wednesday,September 08 2021]

'చిన్న సినిమాలు బ‌త‌కాల‌నే నేను మొద‌టి నుంచి కోరుకుంటున్నా. ఆ క్ర‌మంలో నేను ఏం మాట్లాడినా పెద్ద‌లు సీరియ‌స్‌గా తీసుకోలేదు. స్పోర్టివ్‌గా తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున‌, దాము వంటి వారు న‌న్ను సోదరిడిలానే భావించారు. సినిమా స‌మ‌స్య‌ల‌పై నేను గ‌ట్టిగా మాట్లాడినా వ్య‌తిరేకంగా వారు చూడ‌క‌పోవ‌డం నా అదృష్టంగా భావిస్తున్నానని' ప్ర‌ముఖ నిర్మాత, దర్శకుడు నట్టికుమార్ పేర్కొన్నారు.

బుధవారం ఆయన జన్మదినోత్సవం. ఈ సందర్భంగా సినీ రంగంలోని తన అనుభవాలు, తాను చేస్తున్న, చేయబోతున్న విషయాలను మంగళవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలియజేశారు.

తెలుగు సినిమారంగంలో ఆఫీస్‌బాయ్ నుంచి నిర్మాత స్థాయికి ఎదిగ‌డానికి కార‌ణ‌మైన తెలుగు క‌ళామ‌త‌ల్లికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నా. నా ఎదుగుద‌ల‌కు కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. సినిమారంగానికి వ‌చ్చి 32 ఏళ్లు అయ్యింది. ఈ ఏడాది నేను యాభై పుట్టినరోజు జరుపుకుంటున్నాను.

ప్ర‌తి ఏడాది పుట్టిన‌రోజున ఏదో ప్ర‌త్యేక‌త వుంటుంది. ఈ ఏడాది మాత్రం మ‌రింత ప్రియ‌మైన‌ది. నాకుమారుడు నట్టి క్రాంతి హీరోగా 'సైకోవ‌ర్మ‌' సినిమా విడుదలకు సన్నద్ధమవుతోంది. అదేవిధంగా నా కుమార్తె నట్టి కరుణ కధానాయకిగా పరిచయమవుతున్న డి.ఎస్.జె. 'దెయ్యంతో స‌హ‌జీవ‌నం' చిత్రాన్ని త్వరలో విడుదల చేయబోతున్నాం. ఇక నేనుకూడా 2 వేల సంవ‌త్స‌రంలో ద‌ర్శ‌క‌త్వం మానేశాను. మ‌రలా ఇప్పుడు ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నాను. ఇవి నాకు ఈ ఏడాది ప్ర‌త్యేకత‌లు.

ప్ర‌తి ఏడాది సినిమాలు నిర్మిస్తున్నాను. రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో కొన్ని సినిమాలు చేశా. మా భాగ స్వామ్యంలో రూపొండుతున్న ఇంకొన్ని సినిమాలను తగిన టైమ్ లో విడుదల చేస్తాం. ఎందుకంటే నేను సినిమానే న‌మ్ముకున్నా. వేరే వ్యాపారులున్నా సినిమా అంటేనే నాకూ, అలాగే నా పిల్ల‌ల‌కూ ప్రాణం. డా.రాజ‌శేఖ‌ర్‌ 'అర్జున' సినిమాను త్వ‌ర‌లో విడుద‌ల చేస్తాను.

సినిమా ప‌రిశ్ర‌మ‌లో నాకు గురువులు డా. దాస‌రినారాయ‌ణ‌రావుగారు, డా. డి. రామానాయుడుగారు. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌గారు. వారి ద‌గ్గ‌రే నేను చిన్న‌ప్ప‌టినుంచి పెరిగాను. వారి పేరు ఎక్క‌డా చెడ‌కొట్ట‌కుండా నీతి నిజాయితీగా వుండ‌మ‌ని చెప్పిన‌ట్లు న‌డిచాను. నేను ఏదైనా ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడతాను. ఏ ఒక్క‌రూ ల‌బ్దిపొంద‌కూడ‌దు. ప‌దిమందీ సినిమారంగ‌లో వుండాల‌నే నా భావ‌న‌. మా గురువులు నేర్పింది కూడా అదే.

ఇక నా కుమార్తె నట్టి కరుణ నాయిక‌గా కాశ్మీర్ స‌మ‌స్య‌పై ఐదు భాష‌ల్లో ఓ సినిమా చేయ‌బోతున్నాను. ఆర్టిక‌ల్ 370పై వుండే క‌థ అది. ఆ క‌థ‌లో మ‌హిళ‌కు వున్న హ‌క్కుల‌కోసం పోరాడే సినిమా. ఆ సినిమాను త్వ‌ర‌లోనే ప్రారంభించ‌బోతున్నాను. అలాగే డా.రాజ‌శేఖ‌ర్‌గారితో ఓ సినిమా చేసే ప్లాన్ ఉంది. ఇంకా మూడు సినిమాలు ప్లాన్‌లో వున్నాయి. ప్ర‌తి ఏడాది ఎనిమిది సినిమాలు చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్నాను. నా కుమారుడు నట్టి క్రాంతి, కుమార్తె నట్టి కరుణ పేరున్న సీనియ‌ర్ ఆర్టిస్టుల కాంబినేషన్న‌ లో నటించేవిధంగా కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. అందుకు సంబంధించిన కధా చర్చలు జరుగుతున్నాయి.

32 ఏళ్ళ‌లో ఎంతోమంది నాకు స‌హ‌క‌రించినందుకు పేరు పేరున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. ర‌మేష్ ప్ర‌సాద్‌గారు నాకు ఆర్థికంగా అండ‌గా నిలిచిన రోజులు మరచిపోలేను. నేను ఏరోజు మాట్లాడినా ఫిలింఛాంబ‌ర్‌ను అగౌర‌ప‌ర్చ‌లేదు. చిన్న సినిమాలు బ‌తకాల‌ని 2000 నుంచి నేను కోరుకుంటున్నాను. అదే ఇప్ప‌టికీ కోరుకుంటున్నా. నాలాగే ఎంద‌రో కొత్త‌వారు సినిమాపై ప్రేమ‌తో వ‌స్తున్నారు. వారంతా ప‌రిశ్ర‌మ‌లో బాగుప‌డాల‌ని ఆశిస్తున్నానని తెలిపారు.

More News

‘సీటీమార్‌’...మాస్, క్లాస్ సహా అందరికీ నచ్చే కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా: హీరో గోపీచంద్‌

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’.

మహాసముద్రంలోని సెకండ్ సింగిల్ `చెప్పకే చెప్పకే..`ను రిలీజ్ చేసిన హీరోయిన్ రష్మిక మందన్న

సిద్దార్థ్, శర్వానంద్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా ప్రమోషన్స్ ఫుల్ జోరు మీదున్నాయి.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం తాజా సమాచారం

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ , ప్రముఖ యువ దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో

సాయితేజ్, దేవ్ కట్టా చిత్రం ‘రిపబ్లిక్’ నుంచి ‘జోర్ సే...’ సాంగ్ విడుదల

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ `రిప‌బ్లిక్‌`. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది.

కమర్షియల్ గ్రాఫ్ ఉంటూనే.. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండే సినిమా  ‘టక్ జగదీష్` - ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌

'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత  నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా