మొన్న ఎన్టీఆర్ - నేడు ర‌వితేజ‌..

  • IndiaGlitz, [Thursday,May 19 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎ.పి ఆర్ 7 ఎ.ఎక్స్ 9999 కారులో ప్ర‌యాణిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ప్ర‌యాణిస్తున్న కారు అద్దాల‌కు లోప‌ల ఎవ‌రున్నారో క‌నిపించ‌కుండా ఉండేందుకు బ్లాక్ ఫిల్మ్ వేసి ఉంది. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉండ‌డంతో ట్రాఫిక్ పోలీస్ కారు ఆపి ఫైన్ క‌ట్ట‌మ‌న్నాడు. బ్లాక్ ఫిల్మ్ వేసి ఉన్నందుకు ట్రాఫిక్ పోలీస్ 700 రూపాయ‌లు ఫైన్ వేసాడు. ఎన్టీఆర్ ఏమీ మాట్లాడ‌కుండానే ఫైన్ క‌ట్టారు. ఇది ఇటీవ‌ల జ‌రిగిన సంఘ‌ట‌న‌.

ఇక నేడు మాస్ రాజ ర‌వితేజ‌కు కూడా ఇదే అనుభవం. ఈరోజు ర‌వితేజ ఏపీ 28 డీకే 4742 నంబరు గల కారులో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్ర‌యాణ‌స్తున్నారు. అయితే...ఆ కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేసి ఉండటంతో జూబ్లిహిల్స్ పోలీసులు కారు ఆపి.. రవితేజకు కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ను ఉపయోగించకూడదని చెప్పారు. అంతే కాదండోయ్...కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను పోలీసులు అప్పటికప్పుడు తొలగించారు. నిబంధనల ప్రకారం రూ.800 జరిమానా విధించారు. చేసేదేమి లేక‌...ఫైన్ క‌ట్టి ర‌వితేజ అక్క‌డి నుంచి వెళ్లిపోయార‌ట‌.

More News

టు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ రెడీ చేస్తున్న‌జ‌న‌తా టీమ్...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నభారీ  చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు.

జూన్ మొదటి వారంలో 'క‌బాలి' పాట‌లు విడుద‌ల‌ జులై 1న సినిమా విడుదల

సినిమా రంగంలో సాటిలేని స్టార్ ర‌జ‌నీకాంత్. ఆయ‌న సినిమా చేస్తున్నారంటే త‌మిళ‌నాటే కాదు ఇటు సౌత్ అంత‌టా,  అటు నార్త్ లోనూ, ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల్లో ఆయ‌న అభిమానులు, సినిమా ప్రేమికులు ఆ చిత్రం కోసం ఎదురుచూస్తుంటారు.

క‌ట్ట‌ప్ప గురించి బిగ్ న్యూస్ చెప్పిన కె.టి.ఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తార‌క రామారావు ఈరోజు బిగ్ న్యూస్ చెబుతాను అన్నారు. అయితే...కె.టి.ఆర్ చెప్పే బిగ్ న్యూస్ ఏమిటా అని ఆస‌క్తిగా ఎదురు చూసారు. ఇంత‌కీ కెటిఆర్ చెప్పాల‌నుకున్న బిగ్ న్యూస్ ఏమిటంటే.

నిజ‌మైన అభిమాని నాగ శౌర్య‌..

ఊహ‌లు గుస‌గ‌స‌లాడే..చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన యువ హీరో నాగ శౌర్య‌. ఆత‌ర్వాత దిక్కులు చూడ‌కు రామ‌య్య‌, ల‌క్ష్మి రావే మా ఇంటికి, జాదుగాడు, క‌ళ్యాణ వైభోగ‌మే...త‌దిత‌ర చిత్రాల‌తో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు.

హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది...

సాయిధరమ్ తేజ్ తొలి చిత్రం రేయ్. కానీ విడుదల విషయానికి వస్తే సాయిధరమ్, ఎ.ఎస్.రవికుమార్ చౌదరి కాంబినేషన్ లో రూపొందిన పిల్లానువ్వులేని జీవితం ముందు విడుదలై తొలి సక్సెస్ అందించింది.