అప్పుడు ఐటం గ‌ర్ల్‌.. ఇప్పుడు హీరోయిన్‌

  • IndiaGlitz, [Saturday,October 03 2015]

మెగాస్టార్ చిరంజీవి ఆరేళ్ల విరామం త‌రువాత వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్న చిత్రం బ్రూస్ లీ. రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో చిరు గెస్ట్ అప్పీరియ‌న్స్ ఇవ్వ‌నున్నారు. బ్రూస్ లీకి ముందు చిరంజీవి తెర‌పై మెరిసిన సినిమా కూడా చ‌ర‌ణ్ దే కావ‌డం విశేషం. మ‌గ‌ధీర పేరుతో రూపొంది సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన ఆ సినిమాలో చిరు ప్రారంభ దృశ్యాల్లో క‌నువిందు చేస్తే.. బ్రూస్ లీలో ప‌తాక స‌న్నివేశాల్లో సంద‌డి చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. మ‌గ‌ధీర కోసం అటు చిరంజీవితోనూ, ఇటు రామ్‌చ‌ర‌ణ్ తోనూ ఏక కాలంలో క‌లిసి న‌టించే అవ‌కాశాన్ని ఆ సినిమాలో బంగారు కోడి పెట్ట సాంగ్‌లో త‌ళుక్కుమ‌న్న ఐటం గ‌ర్ల్ ముమైత్ ఖాన్‌కి ద‌క్కించుకుంది. ఇక‌ బ్రూస్ లీ విష‌యంలో చిత్ర క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి ఆ బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కిందని స‌మాచార‌మ్‌. తండ్రీ కొడుకుల మ‌ధ్య క‌నిపించి ముమైత్ భారీ హిట్‌నే త‌న సొంతం చేసుకుంది. మ‌రి హీరోయిన్ ర‌కుల్ కూడా ఆ ఫీట్‌నే రిపీట్ చేస్తుందేమో చూడాలి.

More News

చిరు 150వ సినిమా ఎనౌన్స్ మెంట్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి అటు అభిమానులు, ఇటు ఇండ‌స్ట్రీ ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నారు.

విజ‌య్ టాక్స్ క‌ట్ట‌డం లేదా..?

హీరో విజ‌య్, హీరోయిన్ స‌మంత‌, న‌య‌న‌తార ఇళ్ల‌పై ఇన్ క‌మ్ టాక్స్ అధికారులు దాడులు చేసిన విష‌యం తెలిసిందే.

'పులి' చిత్రానికి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది - నిర్మాత సి.శోభ

ఇళయదళపతి విజయ్ హీరోగా ఎస్.కె.టి.స్టూడియోస్ పతాకంపై చింబుదేవన్ దర్శకత్వంలో చింబుదేవన్ దర్శకత్వంలో

'శివమ్' మూవీ రివ్యూ

అక్టోబర్ 2న విడుదలైంది శివమ్. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ నటించిన కంచె విడుదల కావాల్సింది. దీనికి ఒక రోజు ముందు అంటే గురువారం పులి తెలుగులో విడుదల కావాల్సింది. కానీ అవి రెండూ విడుదల కాలేదు. సో రామ్ నటించిన శివమ్ సోలో రిలీజ్ అయింది. ఈ సోలో రిలీజ్ ని రామ్ సక్రమంగా వినియోగించుకున్నారా?

'అ..ఆ..'ఓవర్ సీస్ హక్కులు....

నితిన్ , సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'అ..ఆ...' .