క‌మ‌ల్ మ‌న‌వ‌డిగా శింబు కాదు.. సిద్ధార్థ్‌

  • IndiaGlitz, [Thursday,January 17 2019]

యూనివ‌ర్ప‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌న చివ‌రి చిత్రం 'ఇండియ‌న్ 2' కు సిద్ధ‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే సెట్స్‌కు వెళ్ల‌బోయే ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌మ‌ల్ జోడిగా న‌టించ‌నుంది. కాగా ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ మ‌న‌వ‌డి పాత్ర‌లో హీరో శింబు న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం 'ఇండియ‌న్' సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తోన్న 'ఇండియ‌న్ 2' క‌మ‌ల్ మ‌న‌వ‌డిగా సిద్ధార్థ్ న‌టించ‌బోతున్నార‌ట‌. గ‌తంలో శంక‌ర్ 'బాయ్స్‌' చిత్రం ద్వారా సిద్ధార్థ్ హీరోగా రంగ ప్ర‌వేశం చేశాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణంలో సినిమా రూపొంద‌నుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నేటి నుండి చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.