శ‌ర్వానంద్‌, స‌మంత చిత్రం 'జాను' .. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Tuesday,January 07 2020]

శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రానికి 'జాను' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన '96' సినిమాకు ఇది రీమేక్‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగ‌ళ‌వారం రోజున ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా... 

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''శ‌ర్వానంద్‌, స‌మంత కాంబినేష‌న్‌లో తొలిసారి రూపొందుతోన్న చిత్రానికి 'జాను' టైటిల్‌ను ఖ‌రారు చేశాం.  బ్యూటీఫుల్ అండ్ హార్ట్ ట‌చింగ్ ల‌వ్‌స్టోరి ఇది. షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ సినిమాను బ్యూటీపుల్‌గా తెర‌కెక్కించారు. శ‌ర్వానంద్‌, స‌మంత పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. గోవింద్ వ‌సంత సంగీతం, మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు అద‌న‌పు బ‌లంగా ఉంటాయి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌, పాట‌ల‌ను విడుద‌ల చేయ‌బోతున్నాం'' అన్నారు.

More News

'అల వైకుంఠ‌పుర‌ములో' మ్యూజిక‌ల్ ఫెస్టివల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా శ్రీమ‌తి మ‌మ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతాఆర్ట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్టర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో

రజనీకాంత్ నాకు రోల్ మోడల్.. ‘దర్బార్‌’కు ఆల్ ది బెస్ట్ : బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సునీల్ నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’.

విఘ్నేశ్‌తో విడిపోయారన్న వార్తలపై నయన్ క్లారిటీ

లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి నటన పరంగా ప్రత్యేకించి మరి చెప్పనక్కర్లేదు. ‘నాకు నేనే పోటీ.. నాకు నేనే సాటి’ అన్నట్టుగా నటించేస్తుంటుంది. అయితే రీల్ లైఫ్ వరకూ అంతా ఓకే గానీ..

మోదీని 'మంచు' కలవడం వెనుక కారణలివీ..!

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవ్వడంతో రకరకాలుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిగో వైసీపీకి టాటా చెప్పేసి..

రాజశేఖర్ రాజీనామాపై జీవిత స్పందన ఇదీ...

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి-యాంగ్రీస్టార్ రాజశేఖర్‌..