close
Choose your channels

హార్ట్ ట‌చింగ్ మెలోడీ సాంగ్‌తో ఆక‌ట్టుకుంటున్న 'జాను'

Tuesday, January 21, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హార్ట్ ట‌చింగ్ మెలోడీ సాంగ్‌తో ఆక‌ట్టుకుంటున్న జాను

శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం `జాను`. ఈ సినిమాలో తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

``ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా
గానం తొలి గానం పాడే వేళ‌
తారా తీరం మ‌న దారిలోకాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉద‌యాల‌నే విసిరేలా...`` అంటూ హార్ట్ ట‌చింగ్ మెలోడీ ప్రేమ‌లోని గాఢ‌త ఈ పాట‌లో తెలియ‌చేస్తుంది. గోవింద్ వ‌సంత సంగీత సార‌థ్యంలో శ్రీమ‌ణి రాసిన ఈ పాట‌ను చిన్న‌యి, గౌత‌మ్ భ‌ర‌ద్వాజ్ ఆల‌పించారు.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల‌ను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.