యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం.. తండ్రి సుదర్శన్ రావు కన్నుమూత

  • IndiaGlitz, [Sunday,December 05 2021]

జబర్దస్ట్ యాంకర్, సినీ నటి అనసూయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న సుదర్శన్ రావు.. చికిత్స పొందుతున్న క్రమంలో హైదరాబాద్ తార్నాకలోని స్వగృహంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. దీంతో అనసూయ కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

వ్యాపార రంగంలో స్థిరపడిన సుదర్శన్ రావు... కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కాలంలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రెటరీగానూ పనిచేశారు. తన తల్లికి గుర్తుగా ఆమె పేరునే అనసూయకు పెట్టారు. సుదర్శన్ రావుకు అనసూయతోపాటు మరో కుమార్తె కూడా ఉంది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు అనసూయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. కాగా, అనసూయ డిసెంబరు 17న అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటే మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య', 'భీష్మ పర్వం', 'ఖిలాడి', 'పక్కా కమర్షియల్',' రంగ మార్తాండ' సినిమాల్లోనూ కీలకపాత్రలు పోషిస్తోంది.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: శ్రీహాన్ గిఫ్ట్.. సిరి కోసం షన్నూ త్యాగం, పింకీకి హౌస్‌లో ఉండే అర్హత లేదా..?

బిగ్‌బాస్ 5 తెలుగులో శనివారం ఎపిసోడ్ సంతోషాలు, ఎమోషనల్ మేళవింపుగా సాగింది. నాగార్జున ఇంటి సభ్యులకు కొన్ని పరీక్షలు పెట్టి వారితో కామెడీ చేయించారు.

‘రామ్‌ అసుర్‌’ సూపర్‌ సక్సెస్‌తో టీం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం: హీరో అభినవ్‌ సర్ధార్‌

ఎఎస్‌పి మీడియా హౌస్‌, జివి ఐడియాస్‌ పతాకాలపై అభినవ్‌ సర్ధార్‌, రామ్‌ కార్తిక్‌, చాందిని తమిళ్‌రాసన్‌, శాని సాల్మాన్‌, శెర్రి అగర్వాల్‌  నటీనటులుగా

‘సిగురాకు సిట్టడివి గడ్డ  చిచ్చుల్లో అట్టుడికి పోరాదు  బిడ్డా‘ భీమ్లా నాయక్' కోసం అడవి తల్లి గీతం

'భీమ్లా నాయక్' నుంచి మరో పాట విడుదల స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి కు నివాళి

నన్ను రాజకీయాల్లోకి మనస్పూర్తిగా ఆహ్వానించారు... రోశయ్య మరణంపై చిరంజీవి ఎమోషనల్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతికి గురయ్యారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: టికెట్ టూ ఫినాలే‌లో గెలుపు.. ఫైనల్‌లో అడుగుపెట్టిన శ్రీరామ్

తుది అంకానికి చేరే కొద్ది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఉత్కంఠ రేపాల్సింది పోయి.. బోర్ కొట్టిస్తోంది.