జ్యోతిక 'జాక్‌పాట్ 'ట్రైలర్, ఆడియో విడుదల

  • IndiaGlitz, [Saturday,July 27 2019]

జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా జాక్‌పాట్. పూర్తిస్థాయి హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా జాక్‌పాట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కళ్యాణ్. జ్యోతిక‌కు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. ఇది వ‌ర‌కు ఆమె ఇక్క‌డ చాలా సినిమాల్లో కూడా నటించారు. పెళ్లి త‌ర్వాత కొన్నేళ్ళు గ్యాప్ తీసుకున్న‌ జ్యోతిక ఇప్పుడు మ‌ళ్లీ జాక్‌పాట్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇందులో జ్యోతిక‌, రేవతి కాంబినేషన్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. యోగి బాబు, ఆనంద్ రాజ్ ప్ర‌ముఖ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే తెలుగులో కూడా భారీ వేడుక ఒక‌టి ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కళ్యాణ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తో పాటు ఆడియో ని విడుదల చేశారు. సూర్య చేతుల మీదుగా ఈ ఆడియో విడుదల అయింది.

ఈ సందర్బంగా..

సూర్య మాట్లాడుతూ...

జాక్ పాట్ మా ఇద్దరికీ చాలా స్పెషల్, ముఖ్యంగా నాకు చాలా చాలా స్పెషల్ ఎందుకంటే, ఈ సినిమా కథ నాకు ఎంతగా నచ్చిదంటే, ఈ సినిమాను వేరే నిర్మాతలు ఎవరు తీసిన సరిగా రాదు ఏమో అనే భయం తో, నేనే నా బ్యానర్ పై జాక్ పాట్ ని నిర్మించాను, మా బ్యానర్ కి ఈ సినిమా తో మరో హిట్ రాబోతుందని నమ్ముతున్న, అలానే ఈ సినిమాలో ఇద్దరు లీడ్ స్టార్స్ ని చూస్తుంటే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఏమైనా ముల్టీ స్టార్రర్ లో నటించారా అనిపిస్తుంది. యాక్షన్ తో పాటు కామెడీ కూడా మా జ్యోతిక, అలానే రేవతి గారు అద్భుతంగా పండించారు. నా సినిమాలని ఆదరిస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న తెలుగు అభిమానులు, జాక్ పాట్ ని హిట్ చేస్తారని కొర్కుకుంటున్నాను. అని తెలిపారు

జ్యోతిక మాట్లాడుతూ...

చాలా రోజులు తరువాత మా సొంత బ్యానర్ లో సినిమా చేశాను. దాంతో పాటే.. ఈ సినిమాలో యాక్షన్ కోసం చాలా స్టంట్ చేయాల్సి వచ్చింది. ముందు కాస్త భయపడిన మా ఇంట్లోనే ఓ యాక్షన్ హీరో ఉండటం, ఆయనే నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో రేవతి గారితో కలిసి నటించడం చాలా ఆనందం గా ఉంది. ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది అని నమ్ముతున్న అని అన్నారు

న‌టీన‌టులు: జ్యోతిక‌, రేవతి, యోగిబాబు, ఆనంద్ రాజ్, మొట్ట రాజేంద్ర‌న్, మ‌న్సూర్ అలీ ఖాన్, జ‌గ‌న్ త‌దిత‌రులు

More News

ప్రజలు నవ్వుకుంటున్నారు బాబూ.. మైండ్‌సెట్ మార్చుకోండి!!

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక చట్టాలను

రాజ‌మహేంద్ర‌వ‌రంలో 'ఇండియ‌న్ 2'

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ... 23 ఏళ్ల ముందు `భార‌తీయుడు` సినిమా విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది.

రెమ్యున‌రేష‌న్ పెంచేసిన సమంత‌

స‌మంత అక్కినేని ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్‌. ఈమె సినిమాల్లో చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు.

వరదలో చిక్కుకున్న ‘మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్’.. ఆందోళన ప్రయాణికులు!

మహారాష్ట్రలో ముంబై - కొల్హాపూర్ మధ్య వాంగ్నీ ప్రాంతంలో ‘మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్’ వరదనీటిలో చిక్కుకుంది.

బిగ్‌బాస్: మహేశ్ సారీ చెప్పినా వినని కపుల్స్.. శ్రీముఖి ఫసక్ !!

బిగ్‌బాస్ ఎపిసోడ్-05లో తన భార్య వితికకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంటూ వరుణ్ సందేశ్.. ఫన్‌బకెట్ ఫేమ్ మహేశ్‌ విట్టాకు వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే.