'జగదేకవీరుడు అతిలోకసుందరి'.. 3D ప్రింట్ కోసం ఎంతో కష్టం


Send us your feedback to audioarticles@vaarta.com


టాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటి 'జగదేకవీరుడు అతిలోక సుందరి'. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా ఇది. 1990వ సంవత్సరం మే నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ ఏడాది ఈ సినిమా మే 9న మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతుంది. అది కూడా 2D-3D ఫార్మాట్లలో.
ఈ సోషియో-ఫాంటసీ డ్రామాకు విజనరీ దర్శకుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా శ్రీదేవి నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ శాలిని, బేబీ షామిలీ కీలక పాత్రలు పోషించారు.
ఈ క్లాసిక్ చిత్రాన్ని లేటెస్ట్ ప్రింట్ తో నేటితరం ప్రేక్షకుల ముందు పెట్టాలనే సవాలుతో చిత్ర బృందం ఎంతో కష్టపడింది. మూడు సంవత్సరాల పాటు ఎన్నో చోట్ల, ఎంత వెతికినా కూడా అసలైన నెగెటివ్ దొరకలేదు. చివరికి దొరికిన కాపీ కూడా చాలా దెబ్బతిని ఉంది. అయినప్పటికీ, ప్రసాద్ కార్పొరేషన్ సహకారంతో చిత్రబృందం అవిశ్రాంతంగా శ్రమించి ప్రైమ్ ఫోకస్ సాయంతో 3D రూపానికి తీసుకురావడంలో విజయవంతమయ్యారు.
2018లో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' నెగటివ్ రీల్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి మూలకు ఫోన్ చేసి, చిన్న థియేటర్లలోనూ ఉపయోగపడే రీల్ ఉందేమో అడిగి తెలుసుకుంది చిత్రబృందం. అయితే కొన్నిచోట్ల రీల్స్ పూర్తిగా డికంపోజ్ అయ్యాయి. చివరకు 2021లో విజయవాడలోని అప్పారావు అనే వ్యక్తి వద్ద ఉపయోగపడే ప్రింట్ రీల్ ఒకటి దొరికిందని చిత్రబృందం చెబుతోంది. అదికూడా దుమ్ము దూళితో నిండిపోయి మసకబడిపోయిన స్థితిలో ఉండగా.. చిత్రయూనిట్ ఎంతో కష్టపడి పునరుద్ధరణ ప్రారంభించింది.
రీల్ ఎక్కడెక్కడ కట్ అయిందో అక్కడ దానికి రిపేర్ చేసి, జాగ్రత్తగా స్కాన్ చేశారు. ఫ్రేమ్ వారీగా ఉన్న డిజిటల్ స్క్రాచెస్‌ను తొలగించారు. తర్వాత చిత్రాన్ని 8K రెజల్యూషన్‌లో డిజిటైజ్ చేసి, 4K అవుట్‌పుట్‌గా మార్చారు. భారతీయ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని విధంగా, చిత్రాన్ని 3D రూపంలోకి మార్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com