close
Choose your channels

అచ్చెన్నా.. ఎలా ఉంది..: కారు ప్రమాదంపై జగన్ ఆరా

Monday, December 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అచ్చెన్నా.. ఎలా ఉంది..: కారు ప్రమాదంపై జగన్ ఆరా

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు కారు ఇటీవలే ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లా నక్కపల్లి హైవే మీద ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అచ్చెన్నాయుడు, కారు డ్రైవర్, ఎమ్మెల్యే గన్‌మెన్‌లకు గాయాలయ్యాయి. అచ్చెన్నకు కూడా చేతికి గాయమైంది. అయితే ఈ ప్రమాదంపై సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు.

అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు జరపాలన్నదానిపై బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా అచ్చెన్న రోడ్డు ప్రమాదం ప్రస్తావన వచ్చింది. ‘అచ్చెన్నా.. ప్రమాదం ఎలా జరిగింది..? ఇప్పుడు ఎలా ఉంది..’ అని జగన్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు నిశితంగా వివరించారు. తనకు స్వల్ప గాయాలు అయ్యాయని, ఇప్పుడు అంతా బాగుందని జగన్‌కు ఆయన తెలిపారు. అయితే ఈ క్రమంలో చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి వీరిద్దరి మధ్య జోక్యం చేసుకున్నారు.

శ్రీకాంత్ : మా సీఎంకు మీపై ఎంత ప్రేమ ఉందో చూడండి!

అచ్చెన్న: నాకు మాత్రం సీఎం అంటే కోపమా?.. ఆయనకు, నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. మాది వేరే పార్టీ, మీది వేరే పార్టీ. అంత వరకే విభేదం అంతేనని జగన్, శ్రీకాంత్ రెడ్డిలకు అచ్చెన్న వివరించారు. కాగా.. ఈ నెల 17వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 9,10,11,12,13,16,17 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరుపుతామని బీఏసీలో చర్చించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.