జగన్ మరో యూటర్న్.. శాసనమండలి రద్దు నిర్ణయం నుంచి వెనక్కి, అసెంబ్లీలో బుగ్గన తీర్మానం

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుని సంచలనం సృష్టించిన జగన్ సర్కారు… మరో అంశంలోనూ యూటర్న్ తీసుకుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ గతంలో కేంద్రానికి పంపిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మంగళవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కౌన్సిల్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశామని, ఇన్నాళ్లు ఒక సందిగ్ధత నెలకొందని అన్నారు. అందుకే శాసన మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సభకు వివరించారు. అనంతరం మండలి రద్దు ఉపసంహరణ తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది.

కాగా.. జనవరి 27, 2020న శాసన మండలిని రద్దు చేయాల్సిందిగా ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం దానిని కేంద్రానికి పంపింది. అయితే దాదాపు 22 నెలలుగా కేంద్రం వద్దే ఈ తీర్మానం వుండిపోవడం.. ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో జగన్ ప్రభుత్వం కౌన్సిల్ రద్దు నుంచి వెనక్కి తగ్గింది. సమస్యలు రాకుండా చూసుకోవడం…. రాజకీయంగా పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడం ఈ నిర్ణయాల వెనుక కారణాలుగా కనిపిస్తున్నాయి.

More News

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఫ‌స్ట్‌టైమ్‌... డైరెక్ట‌ర్ కామెంటరీతో 'జీ 5'లో ఈ 26న విడుద‌లవుతున్న 'రిప‌బ్లిక్‌'

వీక్షకులకు ఎప్పుడూ కొత్తదనం అందించడం కోసం తపనపడే ఓటీటీ వేదిక 'జీ 5'. వినోదం పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనం ఇస్తూ ఉంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: కొట్టుకోబోయిన శ్రీరామ్- సన్నీ.. ఈవారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే..?

బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ 12వ వారానికి చేరుకుంది. ఇక మూడు వారాలు మాత్రమే మిగిలి వుండటంతో ఎవరు విన్నర్‌గా నిలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

అవన్నీ వదంతులే... నాన్నగారు కోలుకుంటున్నారు: తప్పుడు కథనాలపై కైకాల కుమార్తె ఆగ్రహం

దిగ్గజ నటుడు కైకాల స‌త్యనారాయ‌ణ ఆరోగ్య పరిస్థితిపై మంగ‌ళ‌వారం ఉద‌యం తెలుగు మీడియాలో ఒక్క‌సారిగా త‌ప్పుడు వార్త‌లు గుప్పుమ‌న్నాయి.

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా శృతి హాసన్‌..?

బిగ్‌బాస్ రియాలిటీ షోలకు భారతదేశంలో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు.

అచ్చం సమంత దారిలోనే ప్రియాంక చోప్రా.. ఇన్‌స్టా ఖాతాలో భర్త పేరు తొలగింపు, దాని అర్థమేంటీ..?

బాలీవుడ్‌, హాలీవుడ్‌లలో మోస్ట్‌ లవబుల్‌ కపుల్‌‌గా వెలుగొందుతున్నారు ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్‌.