ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ పాత్ర‌లో జ‌గ్గూ భాయ్‌

  • IndiaGlitz, [Monday,July 02 2018]

యాత్ర పేరుతో మ‌హి .వి.రాఘ‌వ్ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ బ‌యోపిక్‌లో వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి న‌టిస్తున్నారు. రాజ‌కీయాల్లో తెలుగు ప్ర‌జ‌ల‌కు గుర్తుండిపోయిన నాయ‌కుల్లో వై.ఎస్‌.ఆర్ ఒక‌రు.

ఈ సినిమాలో జ‌గ‌న్ పాత్ర‌లో సూర్య లేదా కార్తి.. భూమా శోభానాగిరెడ్డిగా అన‌సూయ‌, కె.వి.పి పాత్ర‌లో రావు ర‌మేశ్ త‌దిత‌రులు న‌టిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. విన‌ప‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం వై.ఎస్‌.ఆర్ తండ్రి వై.ఎస్‌.రాజారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు న‌టించ‌బోతున్నార‌ట‌. ఫ్యాక్ష‌న్ లీడర్ అయిన రాజారెడ్డిని ఆయ‌న ప‌త్య‌ర్థులు హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నారు.

More News

'విశ్వామిత్ర' విల‌న్‌గా..

'గీతాంజలి' లాంటి కామెడీ హారర్‌తో తెలుగు ఇండస్ట్రీ దృష్టిని ఆక‌ర్షించిన‌ దర్శకుడు రాజ్ కిరణ్. ప్ర‌స్తుతం ఈ దర్శకుడు..   'విశ్వామిత్ర' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' ప్రారంభం

హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం "డియర్ కామ్రేడ్" సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో అంద‌రినీ మెప్పించే ప్యూర్ ల‌వ్ స్టోరీ 'తేజ్ ఐ ల‌వ్ యు' - సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో

తండ్రి టైటిల్‌తో నాగ్ మల్టీస్టారర్ మూవీ?

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఆగష్టు 24న‌.. విక్ర‌మ్ చిత్రం

'సామి'.. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఇది ఒకటి. 2003లో హరి దర్శకత్వంలో