జాగ్వార్ లో జ‌గ్గుభాయ్

  • IndiaGlitz, [Saturday,May 21 2016]

క‌థానాయ‌కుడుగా..కుటుంబ క‌థా చిత్రాల్లో న‌టించి ప్రత్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకుని....లెజెండ్ చిత్రంతో ప్ర‌తి నాయ‌కుడుగా కూడా ఆక‌ట్టుకున్నాడు జ‌గ‌ప‌తి. లెజెండ్ సినిమా స‌క్సెస్ తో ప్ర‌తి నాయ‌కుడుగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయిపోయాడు. తెలుగు చిత్రాల్లోనే కాకుండా త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ చిత్రాల్లో కూడా న‌టిస్తున్నాడు.

జ‌గ‌ప‌తి తాజాగా కన్న‌డ‌లో రూపొందున్న జాగ్వార్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో.. కన్నడ మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి తనయుడు నిఖిల్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ మూవీలో జ‌గ‌ప‌తిబాబు కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ్గుభాయ్ స్పందిస్తూ...ఈ చిత్రంలో ఓ ముఖ్య‌పాత్ర పోషించాల‌ని అడిగారు. క్యారెక్ట‌ర్ కూడా న‌చ్చ‌డంతో చేస్తున్నాను. ఈ చిత్ర హీరో నిఖిల్ చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. న‌టుడుగా మంచి పేరు తెచ్చుకుంటాడు. ముఖ్యంగా

షూటింగ్ స్పాట్‌లో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి తన స్థాయిని పక్కనపెట్టి నాతో ఆత్మీయంగా మెలగడం చాలా సంతోషంగా... ఆశ్చర్యంగా ఉంది అన్నారు. జాగ్వార్ స‌క్సెస్ అయితే..క‌న్న‌డలో కూడా బిజీ అవుతాడు జ‌గ్గుభాయ్.

More News

మోహ‌న్ లాల్ హ్యాపీ బ‌ర్త్ డే...

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుని..ప్రేక్షకుల హృద‌యాల్లో సుస్ధిర స్ధానం ఏర్పరుచుకున్న మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్. మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ,  హిందీ చిత్రాల్లో న‌టించిన మోహ‌న్ లాల్ ఉత్త‌మ న‌టుడుగా జాతీయ అవార్డ్ కూడా అందుకున్నారు.

చిరు తో డ్యాన్స్ చేయ‌నున్న ఎమ్మెల్యే...

మెగాస్టార్ చిరంజీవి తో డ్యాన్స్ చేయ‌డానికి ఎమ్మెల్యే రెడీ అవుతుంద‌ట‌. ఎవ‌రా ఎమ్మెల్యే అనుకుంటున్నారా..? రియ‌ల్ లైఫ్ ఎమ్మెల్యే కాదు...రీల్ లైఫ్ ఎమ్మెల్యే. అల్లు అర్జున్ న‌టించిన స‌రైనోడు సినిమాలో ఎమ్మెల్యే పాత్ర పోషించింది హీరోయిన్ కేథ‌రిన్.

విక్రమ్ టైటిల్ ఓకే అయ్యింది

చియాన్ విక్రమ్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇరుముగన్. ఈ చిత్రంలో విక్రమ్ రా ఏజెంట్ గా కనపడుతున్నాడు. అంతే కాకుండా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఆసక్తికరమైన విషయమేమంటే విక్రమ్ చేస్తున్న ఒక పాత్ర హిజ్రా అని సమాచారం.

నిఖిల్ సినిమా కొత్త టైటిల్ ఇదే...

శంక‌రాభ‌ర‌ణం సినిమా త‌ర్వాత నిఖిల్ హీరోగా టైగ‌ర్ ఫేమ్ ఆనంద్ ద‌ర్శ‌కత్వంలో  ఓ చిత్రం రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు.

త్రిష నాయ‌కి విడుద‌ల తేదీ ఖ‌రారు..

త్రిష తొలిసారి న‌టించిన హ‌ర్ర‌ర్ మూవీ నాయ‌కి. ఈ చిత్రాన్ని గోవి ద‌ర్శ‌క‌త్వంలో గిరిధ‌ర్ నిర్మించారు. ఈ చిత్రంలో త్రిష కు జంట‌గా గ‌ణేష్ వెంక‌ట్రామ్ న‌టించారు.