close
Choose your channels

వై య‌స్ రాజారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు

Thursday, January 3, 2019 • తెలుగు Comments

తెలుగు వాళ్ల గుండెల్లో ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి గా చ‌రిత్ర సృష్టించిన‌ డాక్ట‌ర్ వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు చేసిన పాద‌యాత్ర‌లో ముఖ్య ఘ‌ట్టాల‌తో నిర్మిస్తున్న‌చిత్రం యాత్ర‌. వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు.

ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ యాత్ర‌ ని తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది.

ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్ర‌మెష‌న్ మెటెరియ‌ల్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డాక్ట‌ర్ వై య‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తండ్రి వైయ‌స్ రాజారెడ్డి గారి పాత్ర‌లో జ‌గ‌ప‌తి బాబు న‌టించారు. ఈరోజు వైయ‌స్ రాజారెడ్డి గారి లుక్ విడ‌ద‌ల చేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz