'శ్రీమంతుడు' సక్సెస్‌ తో టోటల్ యూనిట్ కి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది - జగపతి బాబు

  • IndiaGlitz, [Wednesday,August 12 2015]

సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని అనుకున్నాం కానీ ఇంత పెద్ద సక్సెస్‌ అవుతుందని అనుకోలేదు. ప్రేక్షకుల నుండి యూనానిమస్ రెస్పాన్స్‌ వచ్చింది. అప్పట్లో నేను నటించిన శుభలగ్నం సినిమా వర్షాకాలంలో రిలీజ్ అయినా ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారో ఈ సినిమాని అంతకంటే పెద్ద హిట్ చేశారు. ఈ శ్రీమంతుడు సక్సెస్ తో యూనిట్ కి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అందకు కారణమైన ప్రేక్షకులకు థాంక్స్ అని అన్నారు జగపతి బాబు.

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌ రూపొందిన చిత్రం శ్రీమంతుడు'. ఆగస్ట్‌ 7న ఈ చిత్రం విడుదలైంది. సక్సెస్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయు సమావేశంలో ఇంకా జగపతి బాబు, శృతిహాసన్, కొరటాల శివ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్(సివిఎం)లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

సినిమా ఫస్ట్ షో నుండి అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని ముందుకు సాగుతుంది. . ఓవర్‌సీస్‌ నుండి హ్యుజ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. మేం అందరం అనుకున్న దానికంటే సినిమా పెద్ద హిట్‌ అయిందికమర్షియల్‌ వాల్యూస్ తో కూడిన హానెస్ట్‌ మూవీ ఇదిముఖ్యంగా మహేష్ బాబుగారు క్యారెక్టర్ మలచిన విధం ప్రేక్షకులకు బాగా నచ్చింది. తమిళంలో కూడా సూపర్‌హిట్‌ టాక్‌తో సినిమా నడుస్తుంది. నా సినిమాతో మహేష్‌బాబుగారు తమిళంలో ఎంటర్‌ కావడం హ్యాపీగా ఉంది. సపోర్ట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు.

శృతిహాసన్‌ మాట్లాడుతూ మహేష్‌బాబు ఎక్స్‌ట్రార్డినరీ యాక్టర్‌తో ఈ సినిమాలో నటించడం హ్యపీగా ఉంది, మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే నా క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని ముందే చెప్పాను. అనుకున్నట్లుగానే సినిమా పెద్ద హిట్టయింది.'' అన్నారు.

చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్(సివిఎం) మాట్లాడుతూ మా బ్యానర్‌లో వచ్చిన మొదటి సినిమా. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా యూనానిమస్‌ టాక్‌తో ముందుకెళుతుంది. ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్'' అన్నారు.

More News

అతి త్వరలో రానున్న 'క్రిమినల్స్‌'

‘మంత్ర’, ‘మంగళ’ వంటి విభిన్న చిత్రాను రూపొందించి సక్సెస్‌ ఫుల్‌ దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు

తెలుగులో '100 డేస్ లవ్'

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ లు జంటగా , తమిళంలో ఓకే బంగారం(ఓకే కన్మణి) పేరుతో మరో సక్సెస్ కూడా కొట్టారు.

అనువాద సినిమాని విడుదల చేస్తున్నాడు...

నితిన్..ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, అఖిల్ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అయ్యాడు.

'సినిమా చూపిస్త మావ' శాటిలైట్ హక్కులు వీరివే..

‘ఉయ్యాల జంపాల’ జంట రాజ్‌తరుణ్‌-అవికాగోర్‌ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదలవుతుంది.

చిలుకూరి బాలాజీ తొలి కాపీ సిద్దం

అల్లాణి శ్రీ‌ధ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ టివితో క‌లిసి ఫిల్మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌వేట్ లిమిటెడ్ ప‌తాకంపై రూపుదిద్దుకుంటున్న చిలుకూరి బాలాజీ