ఎన్టీఆర్ సినిమాలో జగపతి బాబు పాత్ర ఇదేనా?

  • IndiaGlitz, [Thursday,March 29 2018]

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ పూజా హెగ్డే జంటగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగ‌తి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ కుటుంబ కథా చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారని సమాచారం. హీరోయిన్‌కి తండ్రిగా.. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఆయ‌న కనిపిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలో కూడా హీరోయిన్ తండ్రిగా ప్రతినాయక పాత్రలో నటించి మెప్పించారు జగపతి బాబు.

మళ్ళీ ఈ చిత్రంలో అటువంటి పాత్రనే వైవిధ్యంగా చేయనున్నారేమో చూడాలి.  ఇప్ప‌టికే.. ఈ సినిమాలో  ఫిట్‌గా కనిపించడం కోసం  ఎన్టీఆర్ ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే.  ఏప్రిల్ 12 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం.. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

రంగస్థలంకి ఇంటర్వెల్ బాంగ్ హైలైట్ అట‌

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది.

యంగ్ హీరోతో సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్?

భిన్నమైన కథలతో.. వైవిధ్యమైన కథనంతో సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట ద‌ర్శ‌కుడు సుకుమార్.

రాజమౌళికి అరుదెన ఆహ్వానం

'బాహుబలి' సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని  పెంచిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ సినిమా మేకింగ్ రాజమౌళి అండ్ టీంకి ఎనలేని పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది.

ర‌వితేజ‌కు జంట‌గా...

'నేను శైల‌జ‌', 'నేను లోక‌ల్' చిత్రాల‌తో మంచి విజయాల‌నే సొంతం చేసుకుంది.

త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ చేస్తుందా?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో