‘శుభలగ్నం’ రీల్ సీన్.. రియల్‌ లైఫ్‌లో రిపీట్.. 15 కోట్లకు డీల్!

  • IndiaGlitz, [Tuesday,January 05 2021]

ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా ఉన్న ఎస్వీ కృష్ణారెడ్డి అందరికీ గుర్తుండే ఉంటారు. ఆయన తెరకెక్కించిన సినిమాలు ఇప్పటి తరం యూత్‌కు కూడా తెగ నచ్చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా ‘శుభలగ్నం’ చిత్రం జనాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జగపతి బాబు అలియాస్ జగ్గుభాయ్ హీరోగా ఆమని, రోజా ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు. అంతేకాదు.. ‘చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక’ అనే పాట అబ్బా ఆ సాంగ్ ఎక్కడ వినిపించినా కాసేపు ఆగి మరీ వింటారు. ఇక స్టోరీ విషయానికొస్తే.. హీరో భార్య ఆమని త్వరగా ధనవంతురాలు అవ్వాలని ఆశపడటం.. ఇందుకుగాను తన భర్తను రోజాకు అమ్మేయడం సీన్‌ గుర్తుండే ఉంటుంది. కానీ ఇదే రీల్ సీన్ రియల్ లైఫ్‌లో జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అస్సలు ఊహేంటండోయ్.. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ ఇలాంటి ఘటన జరిగింది. సంచలనంగా మారిన ఈ ఘటన తాలుకూ వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఇదీ అసలు కథ..!

ఓ తండ్రి తన ఆఫీసులో పనిచేసే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని.. తన తల్లితో నిత్యం గొడవ పడుతున్నాడని.. ఈ గొడవలతో మనశ్శాంతి లేకుండా పోతోందని కుమార్తె ఫిర్యాదు చేసింది. అంతేకాదు చెల్లి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని.. ధ్యాసపెట్టి చదవలేకపోతున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం ఫ్యామిలీ కోర్టు దాకా వెళ్లింది. ఫిర్యాదు స్వీకరించిన ఫ్యామిలీ కోర్టు కుటుంబ సభ్యులందర్నీ ఫ్యామిలీ కౌన్సిలింగ్‌కు పిలిపించింది. ఈ కౌన్సిలింగ్‌లో అవును తాను ఆ మహిళతోనే ఉండటం నిజమేనని.. అంతేకాదు ఆమెతోనే ఉండాలని అనుకుంటున్నట్లు కూడా చెప్పడం గమనార్హం. భర్త మాటలకు నొచ్చుకున్న భార్య అందుకు అస్సలు ఒప్పుకోలేదు. అలా రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి చివరికి ఓ పరిష్కారం దొరికింది.

కండిషన్స్ అప్లయ్..!

అదేనండి.. కండిషన్స్ అప్లయ్ అంటూ భార్య విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంది. తన భర్తను సదరు మహిళకు అప్పగించాలంటే ఖరీదైన ఫ్లాట్‌తో పాటు రూ. 27 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ పెట్టింది. ఈ డీల్‌కు ఓకే అంటేనే తాను భర్తను అప్పగిస్తానని కౌన్సిలింగ్‌లో భార్య చెప్పింది. ఈ షరతుకు భర్త, ఆయన ప్రియురాలు ఇద్దరూ అంగీకరించారట. ఫ్లాట్‌తో కలిపి మొత్తం డబ్బులు రూ. 15 కోట్లు అయినప్పటికీ భర్త, ప్రియురాలు ఇద్దరూ ఒప్పుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా భార్య మాట్లాడుతూ.. తన భర్తను వదులుకోవడం అస్సలు ఇష్టం లేదని.. అయితే భర్త ఇలా ప్రవర్తించడం నచ్చలేదని అందుకే తాను ఒప్పుకున్నట్లు తెలిపారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. చూశారుగా.. అంత డబ్బులు డిమాండ్ చేసినప్పటికీ ఆ భర్త ఒప్పుకుని కట్టుకున్న భార్యను.. పిల్లలను వదులుకుని ఇలా చేశారంటే ఆయన ఎంత అపర ప్రేమికుడో అర్థం చేసుకోవచ్చు. సో.. శుభలగ్నం సినిమాలో అలా జరిగితే.. ఇక్కడ రియల్‌గా ఇలా జరిగింది.

More News

హాట్ యాంక‌ర్‌కి అంత‌క‌న్నా చిన్న‌వి దొర‌క‌లేదా?

ఆ హాట్ యాంక‌ర్‌కి అంత‌క‌న్నా చిన్న‌వి దొర‌క‌లేదా?  ఆమె ట్రై చేయ‌లేదా?  లేకుంటే చేసినా లేవ‌న్నారా?

పవన్ సరసన కియారా.. మహేశ్‌ మూవీలో రేణు!

టైటిల్‌ చూడగానే కాస్త విచిత్రంగా ఉంది కదూ.. అవును మీరు వింటున్నది నిజమేనట. గత నాలుగైదు రోజులుగా ప్రముఖ వెబ్‌సైట్లలో, నెట్టింట్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

మళ్లీ బీజేపీలోకి జీవిత.. ఇంకెన్నిసార్లో!?

టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజశేఖర్, జీవిత దంపతులు ఇప్పటి వరకూ ఎన్ని రాజకీయ పార్టీలు మారారో బహుశా వాళ్లకే గుర్తుండదేమో.

సీన్ రివర్స్.. టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే!

టైటిల్ చూడగానే.. ఇదేంటి సీన్ అంతా రివర్స్‌గా ఉందని ఆశ్చర్యపోతున్నారు కదూ.. అవును మీరు వింటున్నది నిజమే.

పేకాట ఆడితే ఉరిశిక్ష వేసేస్తారా..? : కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ కీలక మంత్రి కొడాలి నాని అనుచరులు పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఈబీ దాడులు నిర్వహించి భారీగా వాహనాలు, నగదు సీజ్ చేసిన విషయం విదితమే.