ద‌స‌రా రేసులో జాగ్వార్

  • IndiaGlitz, [Friday,September 16 2016]

మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ మ‌న‌వ‌డు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ రూపొందిస్తున్నభారీ చిత్రం జాగ్వార్. ఈ చిత్రాన్ని చెన్నాంబిక ఫిలింస్ బ్యాన‌ర్ పై శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్నారు.

బాహుబలి, భజరంగి భాయ్‌జాన్‌ చిత్రాలతో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన గొప్ప కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ జాగ్వార్‌ చిత్రానికి కథ అందించగా, ఎ.మహదేవ్‌ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈనెల 18న హైద‌రాబాద్ లో జాగ్వార్ ఆడియో ఆవిష్క‌రణోత్స‌వంను భారీ స్ధాయిలో నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను ఈ నెల 22న పూర్తి చేసి జాగ్వార్ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 6న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.