‘శివలింగం’ పేరుతో కోటీశ్వరులవ్వాలని కటకటాల్లోకి!

  • IndiaGlitz, [Tuesday,August 06 2019]

మోసపోయేవాళ్లు ఉన్నన్ని రోజులు మోసం చేసేవాళ్లు ఉంటారనే పెద్దలు చెబుతూ ఉంటారు. దీన్నే కొందరు బాగా వంటబట్టించుకుని మోసం చేసి సొమ్ము చేసుకునేందుకు చేయని ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా.. కృష్ణా జిల్లాలో రంగాచార్యులు, దిలీప్‌కుమార్‌, బాలాజీ, శ్రీనివాస్‌, సుధాకర్‌లు శివలింగం పేరుతో కోట్లు సంపాదించి కోటీశ్వరులైపోదామనుకుని చివరికి కటకటాలపాలయ్యారు.

శివలింగంలా ఉండే ఓ పచ్చరాయిని సేకరించి.. దీన్ని దేవుడిపై ఉన్న నమ్మకం ఉన్నవాళ్లు కొంటారంటూ రెండు కోట్ల రూపాయిలకు బేరం పెట్టారు. అంతేకాదు ఎక్కడా ఎవరికీ ఎలాంటి సందేహం రాకుండా జమాలజిస్ట్‌ పర్యవేక్షణలో జమ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ హైదరాబాద్‌లో దీనిని పరీక్షించినట్లుగా ఓ తప్పుడు ధ్రువపత్రాన్ని కూడా సృష్టించారు. ఈ శివలింగం 4.4 కేజీల బరువు ఉందని ఆ సర్టిఫికెట్‌లో తేల్చారు. దీనిని ఎవరు దక్కించుకున్నా కోటీశ్వరులై పోతారని జనాలను నమ్మించడానికి ఓ పుకారు పుట్టించారు. విజయవాడ మొదలుకుని పలు ప్రాంతాల్లో దీన్ని వేలం వేయడానికి యత్నించగా.. వీళ్ల పాచికలు పారలేదు.

ఫైనల్‌గా సోమవారం సాయంత్రం విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఈ మిత్రులందరూ వేలం పాట పెట్టగా విషయం తెలుసుకున్నారు. దీనితో వీరి ఆటకట్టించాలని టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ముఠాను అదుపులోకి తీసుకుని.. ప్రత్యేకంగా పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇలాంటి ముఠాను ఎవరూ నమ్మొద్దని.. ఎవరైనా ఇలా చేస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు చెబుతున్నారు.

More News

'మన్మథుడు 2' ప్రీ రిలీజ్ బిజినెస్

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `మన్మథుడు 2`.

కృష్ణా జిల్లాలో కలకలం.. మూడో తరగతి విద్యార్థి హత్య!

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ నేరాలు ఘోరాలు ఎక్కువవుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలున్నా..

థ్యాంక్స్ చెప్పిన `సాహో` యూనిట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై సుజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `సాహో`.

సాహో లో అరుణ్ విజయ్... పోస్టర్ కి సూపర్బ్ రెస్పాన్స్...

సాహో విడుదలకు రెడీ అయ్యేందుకు సిద్ధమౌతోన్న సందర్భంలో.... సినిమాలో నటించిన ఒక్కో పాత్ర ను పరిచయం చేస్తున్నారు.

సెన్సార్ ఇబ్బందుల్లో కాజల్ అగర్వాల్ చిత్రం

బాలీవుడ్‌లో విజయవంతమైన చిత్రం`క్వీన్`. మ‌ను కుమార్ నిర్మాత‌. బాలీవుడ్ విజ‌య‌వంత‌మైన క్వీన్ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు.