'జక్కన్న' కి సునీల్ సెంటిమెంట్

  • IndiaGlitz, [Thursday,April 07 2016]

ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోతున్న క‌థానాయ‌కుల‌లో సునీల్ ఒక‌రు. హాస్య న‌టుడు నుంచి క‌థానాయ‌కుడుగా ఎదిగిన సునీల్ ప్ర‌స్తుతం మూడు చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. వంశీకృష్ణ ఆకెళ్ల‌తో చేస్తున్న 'జ‌క్క‌న్న' ఫినిషింగ్ స్టేజ్‌లో ఉంది. వీరు పోట్ల‌తో చేస్తున్న 'వీడు గోల్డ్ ఏహే' నిర్మాణం జరుపుకుంటుంటే.. క్రాంతి మాధ‌వ్‌తో చేస్తున్న సినిమా ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

గ‌త చిత్రం 'కృష్ణాష్ణ‌మి' ప‌రాజ‌యం పాల‌యినా.. ఈ చిత్రాల‌పై సునీల్ ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. 'జ‌క్క‌న్న' చిత్రాన్ని మే నెల‌లో విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. అదే గ‌నుక జ‌రిగితే.. సెంటిమెంట్ ప‌రంగా సునీల్‌క‌ది ప్ల‌స్సే. ఎలాగంటే.. మూడ‌క్ష‌రాల టైటిల్‌తో సునీల్ ఓ క‌థానాయ‌కుడుగా న‌టించిన 'త‌డాఖా' కూడా 2013లో మే నెల‌లోనే విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఆ సెంటిమెంట్‌నే తాజా మూడ‌క్ష‌రాల చిత్రం 'జ‌క్క‌న్న' కూడా ఫాలో అవుతుందేమో చూడాలి.

More News

'శ్రీరస్తు శుభమస్తు' కూడా అంతేనా

జయాపజయాల సంగతి పక్కన పెడితే..కొందరు దర్శకులు తమ ప్రతిభతో ఇట్టే ఆకట్టుకుంటారు.అలాంటి వారిలో యువ దర్శకుడు పరుశురామ్ ఒకరు.

'శ్రీరస్తు శుభమస్తు' కూడా అంతేనా

జయాపజయాల సంగతి పక్కన పెడితే..కొందరు దర్శకులు తమ ప్రతిభతో ఇట్టే ఆకట్టుకుంటారు.అలాంటి వారిలో యువ దర్శకుడు పరుశురామ్ ఒకరు.

ఆర్తి అగర్వాల్ బాటలో నయనతార వెళుతుందా?

పదకొండేళ్ల క్రితం అందాల తార ఆర్తి అగర్వాల్ ఓ క్రెడిట్ ని తన సొంతం చేసుకుంది.మళ్లీ ఇప్పుడు అదే దిశ గా మరో తార ప్రయత్నం చేస్తోంది.

స‌ర్ధార్ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సర్దార్ మూవీ లీక్డ్...?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.