close
Choose your channels

భారత్ తరుఫున ఆస్కార్‌కు ‘జల్లికట్టు’

Thursday, November 26, 2020 • తెలుగు Comments

తమిళనాడులోని సంప్రదాయ ఆట జల్లికట్టు ఆధారంగా తెరకెక్కిన మలయాళ చిత్రం ‘జల్లికట్టు’. ఈ చిత్రం మన దేశం తరుఫున ఆస్కార్ 2021 బరిలో నిలవడం విశేషం. 27 చిత్రాలను దాటుకుని ‘జల్లికట్టు’ ఆస్కార్ బరిలో నిలిచింది. భారత్‌ తరుఫున మలయాళం, హిందీ సహా పలు భాషల్లో తెరకెక్కిన 27 చిత్రాలు ఆస్కార్ నామినేషన్స్‌కు పోటీ పడ్డాయి. అయితే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డు చైర్మన్ రాహుల్ రవైల్ ఆస్కార్ కోసం ‘జల్లికట్టు’ చిత్రాన్ని ఎంపిక చేయడం విశేషం.

2002లో ‘లగాన్’ తరువాత ఆస్కార్ తుది జాబితాలో నిలిచిన చిత్రం ఇదే కావడం విశేషం. జల్లికట్టు సినిమా లిజో జోసి పెల్లిస్సెరీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మనుషుల్లో దాగున్న క్రూరత్వాన్ని, జంతువుల పట్ల మనుషుల తీరును ‘జల్లికట్టు’ చిత్రం సూటిగా ప్రశ్నించిందని రాహుల్ రవైల్ పేర్కొన్నారు. 2019లో విడుదలైన ఈ సినిమాలో ఆంటోని వర్గీస్, చెంబన్ వినోద్ జోసి, సబుమన్ అబ్దుసమద్, సంత్య బాలచంద్రన్ తదితరులు నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

‘జల్లికట్టు’ చిత్రానికి హారీస్‌ కథను అందించారు. ఆస్కార్ వేడుకలను 2021 ఏప్రిల్ 25న నిర్వహించనున్నారు. కాగా.. ప్రతి ఏటా జల్లికట్టు ఆటను తమిళనాడులో భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. ఈ ఆటను నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. అయినా కూడా తమిళనాడు వాసులు ఈ సంప్రదాయ ఆటను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఆటను నిషేధించాలని చాలా మంది జంతు ప్రేమికులు కోరుతుంటారు.

Get Breaking News Alerts From IndiaGlitz