జేమ్స్ బాండ్ 25వ చిత్రం టైటిల్ ఖ‌రారు

  • IndiaGlitz, [Wednesday,August 21 2019]

జేమ్స్ బాండ్ చిత్రాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంటాయ‌నే సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు హీరోలు జేమ్స్ బాండ్‌లుగా న‌టించి మెప్పించారు. ప్ర‌స్తుతం డేనియ‌ల్ క్రెయిగ్ జేమ్స్‌బాండ్‌గా న‌టిస్తున్నారు. ఇది వ‌ర‌కు న‌టించ‌న‌ని చెప్పిన ఆయ‌న మ‌న‌సు మార్చుకుని మ‌ళ్లీ న‌టిస్తున్నారు. జేమ్స్ బాండ్ సిరీస్‌ల్లో ఇప్పుడు రూపొందుతోన్నది 25వ చిత్రం. లేటెస్ట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాత‌లు ఖ‌రారు చేశారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 3న ఈ సినిమా ఇండియాలో విడుద‌ల‌వుతుండ‌గా.. అమెరికాలో ఏప్రిల్ 8న విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రానికి 'నో టైమ్ టు డై' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.