Janasena: డల్లాస్‌లో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. హాజరైన కూటమి నేతలు..

  • IndiaGlitz, [Friday,March 15 2024]

అమెరికాలోని డల్లాస్‌లో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనం జరిగాయి. ఈ వేడుకలకు జనసేన, టీడీపీ, బీజేపీ క్యాడర్‌కు చెందిన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన దర్శి అభ్యర్ధి ఎన్నారై వెంకట్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ వెంకట్‌కు ఎమ్మెల్యే సీటు రావాలని వారంతా ఆకాంక్షించారు. అలాగే పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ పార్టీలకు, రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి ఈ కీలక సమయంలో మన సహాయం చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం మరియు అభివృద్ధిని మెరుగుపరచడానికి, మూడు రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత 5 సంవత్సరాలుగా రైతులు, భవన నిర్మాణ కార్మికులు,అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు .మన రాష్ట్రాన్ని రౌడీలు పాలిస్తున్నారు. 30 ఏళ్లు వెనక్కి పోయింది, కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. యువ తరాలకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఆదాయం రావడం లేదు, ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు.
దీంతో పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలిపోకూడదని ఒకే ఒక నినాదాన్ని చెబుతూ.. ఈ కూటమిని సాధించడంలో కీలక పాత్ర పోషించారు' అని తెలిపారు.

ఇక జనసేన, టీడీపీ నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, పంతం నానాజీ, ఆరిమిల్లి రాధాకృష్ణ, జ్యోతుల నెహ్రు జూమ్ కాల్ ద్వారా కనెక్ట్ అయి వారి విలువైన సందేశాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొత్తు ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కూటమిని దీర్ఘకాలం పాటు కొనసాగిస్తామని హామీ ఇచ్చారని.. జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమస్యలతో సతమతమవుతోందని ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారని తెలిపారు. డబ్బులు ఇస్తే వైసీపీకి ఓటు వేయడానికి ప్రజలు కూడా సిద్ధంగా లేరని పేర్కొన్నారు. ఈసారి వైసీపీకి కేంద్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీల నుంచి ఎలాంటి మద్దతు ఉండదన్నారు.

తమ మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా..రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తున్నామని.. ఓట్లు బదిలీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పొత్తు కోసం మధ్యవర్తిత్వం వహించినందుకు పవన్ కల్యాణ్‌ తన పార్టీకి చెందిన సీట్లు తగ్గించుకోవాల్సి వచ్చిందని జనసేన నేతలు తెలిపారు. అందుకే తాము కూడా కుల, మతాలకు అతీతంగా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో పాటు వారి గెలుపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నంచి సుగుణ్ చాగర్లమూడి, కెసి చేకూరి, లోకేష్ కొణిదెల, చింతమనేని సుధీర్, చలసాని కిషోర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. బీజేపీ నుంచి ప్రవల్లిక కూడా పాల్గొని వాలంటరీ వ్యవస్థలో అవకతవకల గురించి ప్రస్తావించారు.

More News

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో SBIపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం.. ఈసీ వెబ్‌సైట్‌లో వివరాలు..

ఎలక్టోరల్ బాండ్ల(Electoral bonds)వ్యవహారంలో SBIపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది.

నూతన ఎన్నికల కమిషనర్ల బాధ్యతల స్వీకరణ.. ఎన్నికల షెడ్యూల్‌కు వేళాయే

లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ వెల్లడించేందుకు సమయం ఆసన్నమైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా నియమితులైన జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్‌లు ప్రధాన ఎన్నికల

AP BJP: ఏపీ బీజేపీలో సీట్లలో చేతులు మారిన కోట్లు.. కేంద్ర పెద్దలకు ఫిర్యాదులు..

ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తు బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు.

పవన్ కల్యాణ్‌ పోటీపై పిఠాపురం టీడీపీలో ఆగ్రహజ్వాలలు.. పెనమలూరులో కూడా..

టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల తర్వాత టికెట్ ఆశించిన కొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీలో కష్టపడిన తమకు టికెట్లు ఇవ్వలేని రగిలిపోతున్నారు.

RGV: పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్‌ మీద పోటీ చేస్తాను.. ఆర్జీవీ సంచలన ట్వీట్..

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడూ ఎలాంటి ట్విస్టులు ఇస్తారో ఊహించడం కష్టం. తనకు నచ్చిన విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు.