janasena: క్రియాశీలక సభ్యులకు బీమా పత్రాలు.. మూడు రోజులూ పండుగలా చేయండి: జనసైనికులకు పవన్ నిర్దేశం

  • IndiaGlitz, [Wednesday,June 08 2022]

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమా పత్రాలు, సభ్యత్వ కిట్లను అందచేసే కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొందారు. వీరికి రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నారు. ఈ బీమా కోసం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నిధిని సమకూర్చారు. మూడు రోజుల పాటు చేపట్టే బీమా పత్రాలు, కిట్లు పంపిణీ కార్యక్రమ నిర్వహణపై రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు.

సమన్వయకర్తల నియామకం:

‘బీమా పత్రం, పార్టీ అధ్యక్షుల వారి మనోగతాన్ని తెలిపే ప్రతులు, ఐడీ కార్డు, పార్టీ స్టిక్కర్స్, పార్టీ క్యాలెండర్ లాంటి వాటితో కూడిన కిట్ ను ప్రతి క్రియాశీలక సభ్యుడికీ అందజేయాలని నాదెండ్ల మనోహర్ నేతలకు సూచించారు. పార్టీ క్షేత్ర స్థాయి కార్యక్రమాల్లో క్రియాశీలక సభ్యులు కీలకంగా వ్యవహరించేలా నిర్దేశించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కడప, కర్నూలు జిల్లాలకు సమన్వయకర్తలను నియమించారు.

సమన్వయకర్తలు వీరే:

కర్నూలు జిల్లా - బొలిశెట్టి సత్య, నయూబ్ కమాల్, ఆకేపాటి సుభాషిణి
కడప జిల్లా - పి.విజయ్ కుమార్, వడ్రానం మార్కండేయబాబు, పొలసపల్లి సరోజ
శ్రీకాకుళం జిల్లా - బోనబోయిన శ్రీనివాస యాదవ్, ఎ.దుర్గా ప్రశాంతి, తాడి మోహన్
విజయనగరం జిల్లా - పాలవలస యశస్వి, గడసాల అప్పారావు, బేతపూడి విజయశేఖర్
విశాఖపట్నం జిల్లా - చేగొండి సూర్యప్రకాశ్, అమ్మిశెట్టి వాసు, ఘంటసాల వెంకటలక్ష్మి

More News

Janasena: గుంటూరు నగర జనసేన పార్టీ కమిటీ నియామకం, 43 మందికి ఛాన్సిచ్చిన పవన్

వచ్చే ఎన్నికల నాటికి సంస్థాగతంగా పటిష్టం  కావాలని భావిస్తోన్న జనసేన పార్టీ ఆ దిశగా దృష్టి పెట్టింది.

రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ చిత్రానికి "మాటే మంత్రము" టైటిల్ ఖరారు

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమాకు "మాటే మంత్రము" అనే టైటిల్ ను ఖరారు చేశారు.

AP SSC Results 2022: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. 71 స్కూళ్లలో అంతా ఫెయిలే, ఎందుకిలా..?

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలను సోమవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

jubilee hills gang rape : ‘రేప్’ చేయాలన్న ఆలోచనే రాకుండా శిక్షలుండాలి : పవన్ కల్యాణ్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

ACB 14400 App: వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై ఫిర్యాదు చేయాలంటే ఏ యాప్ వాడాలి : పవన్ కల్యాణ్

రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో వున్న అవినీతిని కట్టడి చేసేందుకు గాను కొద్దిరోజుల క్రితం 14400 మొబైల్ యాప్‌‌ను ప్రారంభించారు