Pawan Kalyan:టీడీపీ - జనసేన పొత్తు : సమన్వయ కమిటీ నియమించిన పవన్..  నాదెండ్ల మనోహర్‌కు పగ్గాలు

  • IndiaGlitz, [Sunday,September 17 2023]

వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీతో జనసేన నడుస్తుందని ప్రకటించి కలకలం రేపారు పవన్ కల్యాణ్. ఎన్నికలకు ఎంతో సమయం వుండగా ఆయన నోటి నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని సొంత పార్టీతో పాటు టీడీపీ, వైసీపీలు సైతం ఊహించి వుండవు. పవన్ ప్రకటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జనసేనతో టీడీపీ పొత్తు కన్ఫర్మ్ కావడంతో ఈ రెండు పార్టీల్లో జోష్ నెలకొనగా.. వైసీపీలోని కొందరు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

వచ్చేది టీడీపీ - జనసేన ప్రభుత్వమే :

ఇదిలావుండగా శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో కలిసి పనిచేసే సమయంలో ఎవరూ ఇగోలకు పోవద్దని సూచించారు. వైసీపీకి ఆరు నెలలే సమయం వుందని.. వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేద్దామని, పదవుల గురించి తర్వాత ఆలోచిద్దామని పవన్ హితవు పలికారు. ఇక్కడ ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ కాదని ఆయన పేర్కొన్నారు.

నాదెండ్ల అనుభవం ఉపయోగపడుతుంది :

మరోవైపు.. టీడీపీతో సమన్వయం కోసం జనసేన అధినేత ఓ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను సమన్వయ కమిటీకి ఛైర్మన్‌గా నియమించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం వున్న ఆయన ఈ విధులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన ప్రస్తుతం ఎన్డీయేలో భాగమైనప్పటికీ రాష్ట్రంలో కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. జగన్ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ ఆశీస్సులతో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సీట్లు, పవర్ షేరింగ్ విషయాలు తర్వాత మాట్లాడుకుందామని ఆయన తెలిపారు. వైసీపీ లీడర్లు రెచ్చగొట్టే ప్రమాదం వుందని, ఈ విషయంలో సంయమనంతో వుండాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

సనాతన ధర్మం మారుతోంది :

రాజ్యాంగాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలని, సనాతన ధర్మం తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తోందని ఆయన అన్నారు. కాలమాన పరిస్ధితులు, అవసరాల మేరకు సనాతన ధర్మం మారుతుందని.. ద్వేషం, దోపిడీ కొంతకాలం మాత్రమే వుంటాయని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మాన్ని పాటించి ప్రేమతో ముందుకొచ్చే వ్యక్తులే సమాజానికి దిశా నిర్దేశం చేయగలుగుతారని పవన్ అన్నారు.

More News

Bigg Boss 7 Telugu : సెకండ్ హౌస్‌మేట్‌గా శివాజీ .. రూల్స్‌ ప్రకారం ఆడాలన్న నాగ్, కంటెస్టెంట్స్‌కి రేటింగ్

చూస్తూ వుండగానే బిగ్‌బాస్ 7 తెలుగు సెకండ్ వీకెండ్‌కు వచ్చేసింది. ఉల్టా పల్టా అంటూ సీజన్‌ను రక్తి కట్టించేందుకు బిగ్‌బాస్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Game Changer:రామ్‌చరణ్ ‘‘ గేమ్ ఛేంజర్ ’’ ఆడియో సాంగ్ లీక్ .. షాకైన చిత్ర యూనిట్, దిల్‌రాజు యాక్షన్

ఇటీవలి కాలంలో స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద ఎక్కువైంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా లోకేషన్‌ ఫోటోలు,

Prema Vimanam:అక్టోబర్ 13న ‘జీ5’లో ‘ప్రేమ విమానం’

భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్ రూపొందిస్తోన్న ‘పేమ విమానం’

Tirumala:శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన తిరుమల.. రేపే అంకురార్పణ, 18న పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు.

SIIMA Awards 2023 : నా ప్రతి కన్నీటి చుక్కకూ వాళ్లు బాధపడ్డారు.. వారికి పాదాభివందనం , ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

దుబాయ్ వేదికగా జరుగుతున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2023 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.