బిజినెస్‌లో సంపాదించిన డబ్బును ప్రజాసేవకు వెచ్చించారు .. గౌతంరెడ్డికి పవన్ నివాళి

  • IndiaGlitz, [Monday,February 21 2022]

గుండెపోటుతో మరణించిన  ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి భౌతికాయానికి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. అనంతరం గౌతంరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమల శాఖ మంత్రిగా మేకపాటి రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారని ప్రశంసించారు. అలాంటి వ్యక్తి హఠాన్మరణం.. రాష్ట్రానికి తీరనిలోటని, వ్యాపారంలో సంపాదించిన డబ్బును ప్రజాసేవకు ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆయన మృతికి సంతాపంగా తన సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నామని పవన్  కల్యాణ్ వెల్లడించారు.

మరోవైపు తండ్రి మరణవార్తను తెలుసుకున్న అమెరికాలో వున్న మేకపాటి గౌతంరెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి భారత్‌కు బయల్దేరారు. రేపు ఉదయం ఆయన స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. బుధవారం నెల్లూరు జిల్లా బ్రహ్మణపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతకుముందు అపోలో ఆస్పత్రి నుంచి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఈ సాయంత్రం వరకు అక్కడే ఉంచనున్నారు. రేపు నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామానికి గౌతమ్‌రెడ్డి పార్ధీవదేహాన్ని తరలించనున్నారు. ఆయన మరణం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.

కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా మంచిపేరు తెచ్చుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర ప్రజలు, నేతలు గౌతమ్ రెడ్డికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More News

గుండెపోటుతో ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 49 సంవత్సరాలు.

అభిమాని అత్యుత్సాహం.. కారుపై పడిపోయిన పవన్ కల్యాణ్, తప్పిన ముప్పు

జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ నర్సాపురం పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది.

పంజాబ్ ఎన్నికలు: పోలింగ్ బూత్‌లోకి వెళ్లే యత్నం.. సోనూసూద్‌ కారును సీజ్ చేసిన ఈసీ

పంజాబ్ ఎన్నికల వేళ సినీనటుడు సోనూసూద్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది.

మార్చి 4న ప్రేక్షకుల ముందుకు సెబాస్టియన్ పీసీ 524.... హ్యాట్రిక్ హిట్‌పై కన్నేసిన కిరణ్ అబ్బవరం

వినూత్నమైన కథలతో దూసుకెళ్తున్నాడు యువ హీరో కిరణ్ అబ్బవరం.

‘‘లైంగిక వేధింపులకు గురయ్యా’’.. సూసైడ్ నోట్ రాసి ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య

హైదరాబాద్‌‌లో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.