Laurus Labs Accident: లారస్ ల్యాబ్స్‌ ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి.. ఆ పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ ఏది

  • IndiaGlitz, [Thursday,December 29 2022]

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని లారస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని నలుగురు మరణించిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి ఆర్ధిక సాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ ప్రాంతంలోని ఫార్మా పరిశ్రమల్లోనూ, ఇతర పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

రియాక్టర్ పేలుడుతో మంటలు:

ఇకపోతే.. లారస్ పరిశ్రమలోని యూనిట్ 3 కర్మాగారంలో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్లాంట్‌లోని మ్యాన్‌ఫ్యాక్చరింగ్ నెంబర్ 6 బ్లాక్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో రియాక్టర్‌లో పేలుడు సంవించి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఇవి పక్కనే వున్న రబ్బరు పరికరాలకు అంటుకోవడంతో గ్రౌండ్ ఫ్లోర్ అంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో రాంబాబు, తలశిల రాజేశ్ బాబు, రాపేటి రామకృష్ణ, మజ్జి వెంకట్రావులు ప్రాణాలు కోల్పోయారు.

మృతుల కుటుంబాలకు కంపెనీ పరిహారం:

మరోవైపు.. లారస్ ప్రమాదంలో మరణించిన నలుగురు వ్యక్తుల కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. పర్మినెంట్ ఉద్యోగులు ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.70 లక్షలు...కాంట్రాక్ట్ కార్మికులు ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.42 లక్షల చొప్పున పరిహారం త్వరలో అందించనున్నారు. అలాగే దహన సంస్కారాలకు రూ.75 వేల చొప్పున అందజేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.

More News

Sonu Sood:సోనూ సూద్ హై యాక్షన్ థ్రిల్లర్ 'ఫతే' 2023 జనవరి లో సెట్స్

సోనూ సూద్ ఈ పేరు వింటే సామాన్యుడి పెదవిపై చిరునవ్వు విరబూస్తుంది.

Korameenu:‘కొరమీను’ సినిమా ఏ ఒక్కరినీ డిసప్పాయింట్ చేయదు.. హీరో ఆనంద్ రవి

ఆనంద్ రవి కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై

‘లక్కీ లక్ష్మణ్’ ఫ్యామిలీ సబ్జెక్ట్. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం.. హీరో సోహైల్

బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’.

'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' పోస్టర్, టైటిల్ రివీల్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్

"పెళ్లి చూపులు", "డియర్ కామ్రేడ్", "దొరసాని" వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ

‘వాల్తేరు వీరయ్య’ అంచనాలకు మించి వుంటుంది - మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య'