Pawan Kalyan: ఒడిషా రైలు ప్రమాదం.. ఇకనైనా భద్రతా చర్యలు తీసుకోండి : కేంద్రానికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి

  • IndiaGlitz, [Saturday,June 03 2023]

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. శిథిలాల తొలగింపు ముమ్మరంగా చేస్తూ వుండటంతో వాటి కింద చిక్కుకుపోయిన వారు ఒక్కొక్కరిగా బయటికొస్తున్నారు. వీరిలో ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే, తీవ్రంగా గాయపడిన వారు మరికొందరు. అంతేకాకుండా రైలు బోగీల్లో మరో 500 మంది ప్రయాణీకులు చిక్కుకున్నట్లుగా సమాచారం. మరోవైపు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఒడిషా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఇప్పటికే సమీక్షలు నిర్వహించి బాధితులకు అండగా నిలుస్తున్నారు.

భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగొద్దు:

మరోవైపు రైలు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ శుక్రవారం రాత్రి ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది. 278 మంది ప్రయాణీకులు ఈ దుర్ఘటనలో మృత్యువాతపడటం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు - హౌరా సూపర్ ఫాస్ట్ రైళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత ప్రయాణీకులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. ఈ దుర్ఘటన నేపథ్యంలో రైలు ప్రమాద ఘటనల నివారణకు సంబంధించిన భద్రత చర్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ దృష్టి పెట్టాలి ’’ అని పవన్ డిమాండ్ చేశారు.

ప్రమాదం ఎలా జరిగింది:

బెంగళూరు నుంచి హౌరాకు వెళ్తున్న బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానాగా బజార్ స్టేషన్ వద్ద తొలుత పట్టాలు తప్పింది. దీంతో ఈ రైలుకు సంబంధించిన బోగీలు పక్కనే వున్న ట్రాక్‌పై పడ్డాయి. వాటిని షాలిమార్ - చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంగా ఢీకొట్టింది. దీంతో కోరమండల్ రైలుకు సంబంధించి 15 బోగీలు బోల్తా పడ్డాయి. అక్కడితో ఇది ముగియలేదు.. బోల్తా పడ్డ కోరమండల్ బోగీలను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఇలా మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాద తీవ్రత అనూహ్యంగా పెరిగింది.

ప్రమాదం విషయం తెలుసుకున్న రైల్వే, పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. బాలేశ్వర్, భువనేశ్వర్, భద్రక్, మయూర్‌బంజ్, కటక్‌లలోని ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రులను తక్షణం అప్రమత్తం చేసి దాదాపు 115 అంబులెన్స్‌ల ద్వారా వందలాది మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అటు ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోల్తా పడ్డ రైలు నుంచి పలువురి మృతదేహాలను బయటకు తీశాయి.

ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ హైల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది.

ఒడిశా ప్రభుత్వం- 06782-262286.
రైల్వే హెల్ప్‌లైన్లు:
హౌరా 033-26382217;
ఖరగ్‌పూర్‌ 8972073925
బాలేశ్వర్‌ 8249591559;
చెన్నై 044-25330952

వాల్తేరు డివిజన్‌..

విశాఖ : 08912 746330, 08912 744619
విజయనగరం : 08922-221202, 08922-221206.

దక్షిణ మధ్య రైల్వే :

సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం (040 27788516)
విజయవాడ రైల్వే స్టేషన్‌ (0866 2576924)
రాజమండ్రి రైల్వే స్టేషన్‌ (0883 2420541)
రేణిగుంట రైల్వే స్టేషన్‌ (9949198414)
తిరుపతి రైల్వే స్టేషన్‌ (7815915571)
నెల్లూరు రైల్వే స్టేషన్‌ (08612342028)

More News

Odisha Train Accident: ఒడిషా రైలు ప్రమాదం : రెండు రైళ్లలో 120 మంది ఏపీ వాసులు..

ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మంది మరణించడంతో దేశం దిగ్భ్రాంతికి గురైంది.

Odisha Train Accident: మాటలకందని మహా విషాదం: ఒడిషాకు మోడీ.. ప్రమాదస్థలిని పరిశీలించనున్న ప్రధాని

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని..

Sirf Ek Bandaa Kaafi Hai: 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' ట్రైలర్: అసామాన్యుడితో సామాన్యుడి పోరాటం

అత‌నొక సామాన్యమైన వ్య‌క్తి.. వృత్తి రీత్యా లాయ‌ర్‌. కొన్ని ప‌రిస్థితుల్లో ఓ అసామాన్య‌మైన వ్య‌క్తితో ఓ కేసు ప‌రంగా పోరాటం చేయాల్సి వ‌స్తుంది. ఆ సామాన్యుడికి తానెలాంటి పోరాటం

Pawan Kalyan Vaarahi: ఆ రోజు నుండి రోడ్డెక్కనున్న పవన్ వారాహి...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనం వారాహి. ఈ నెల 14 నుంచి పవన్ వారాహి ద్వారా జనాల్లోకి వెళ్లనున్నారు.

క్యాంటీన్‌లో మిత్రులను ఆటపట్టిస్తూ.. కొండ కోనలను ఎక్కేస్తూ.. కాలేజీ రోజుల్లో కేటీఆర్ ఇలా

కల్వకుంట్ల తారక రామారావు.. షార్ట్ కట్‌లో కేటీఆర్ . ఈయన గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన వారసుడిగా ఆయన రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.