Janasena : సంక్షోభం నుంచి సుభిక్షం వైపుకు .. ఆయనో రాజనీతిజ్ఞుడు : పీవీకి పవన్ కల్యాణ్ నివాళి

  • IndiaGlitz, [Tuesday,June 28 2022]

దివంగత ప్రధాన మంత్రి, ఆర్ధిక సంస్కరణల పితామహుడు స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కులాలను విడదీయలేదు.. వర్గవైషమ్యాలను రెచ్చగొట్టలేదు.. ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోయలేదు.. గద్దెనెక్కాక లక్షల కోట్లు సంపాదించనూ లేదు... ఇదీ కదా ఆదర్శనాయకుడంటే అంటూ పీవీని ప్రశంసించారు. అందుకే ఆయనంటే తనకు అమితమైన గౌరవమని.. మాటల్లో చెప్పలేనంత అభిమానమని పవన్ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా పీవీకి వినమ్రంగా అంజలి ఘటిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.

దేశాన్ని సంక్షోభం నుంచి సుభిక్షం వైపుకి నడిపారు:

ఈ దేశాన్ని అభివృద్ధిపథాన నడిపించాలని తపించే ప్రతీ నాయకునికీ పీవీ నరసింహారావు ఆదర్శనీయులని ఆయన కొనియాడు. ఎంత ఒదిగి వున్నా.. ఆయనలోని రాజనీతిజ్ఞత ఆయనను విజయునిగా ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిందని పవన్ గుర్తుచేశారు. స్వాతంత్ర ఉద్యమకారునిగా.. న్యాయవాదిగా.. పాత్రికేయునిగా.. శాసనసభ్యునిగా.. మంత్రిగా.. ముఖ్యమంత్రిగా.. ప్రధాన మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికీ ఆయన చేసిన సేవలు ఎంత కొనియాడినా తక్కువేనన్నారు. దేశం ఆర్థికంగా తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతున్న తరుణంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, లైసెన్స్ రాజ్ ను నిర్మూలించి, ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి ఈ దేశాన్ని సంక్షోభం నుంచి సుభిక్షం వైపు నడిపించారని పవన్ కల్యాణ్ కొనియాడారు.

17 భాషల్లో నిష్ణాతుడు:

ఆయన పరిపాలన దక్షత, రాజకీయ చతురత అసమాన్యమని... ముందస్తు కార్యాచరణ లేకుండా ఆయన ఎన్నడూ చట్టసభలకు హాజరుకాలేదని జనసేనాని గుర్తుచేశారు. కవి, పండితుడే గాకుండా పదిహేడు భాషలలో పీవీ ప్రావీణ్యుడంటే ఆయన మేధో సంపత్తి ఏపాటిదో మనకు అవగతమవుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇలా చెప్పుకొంటూపోతే ఆయన ప్రజ్ఞాపాటవాలు తరగనివి.. చెరగనివి అని అన్నిటికంటే ఆయన మన తెలుగువానిగా తెలంగాణ గడ్డపై జన్మించడం తెలుగు ప్రజలు చేసుకున్న సుకృతమన్నారు. ఆ పుంభావ సరస్వతికి, పరిపాలనా దిగ్గజానికి నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన ఘనంగా జేజేలు పలుకుతున్నానని పవన్ కల్యాణ్ ప్రకటనలో తెలిపారు.

More News

Khairatabad Ganesh: ఈ ఏడాది ఖైరతాబాద్‌ మహా గణపతి రూపమిదే.. 50 అడుగులు, పూర్తిగా మ‌ట్టితోనే త‌యారీ

దేశంలో గ‌ణేశ్ న‌వ‌రాత్రులు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగే న‌గ‌రాల్లో హైద‌రాబాద్ కూడా ఒక‌టి.

అందుకే తారక్ అంటే ఇష్టం .. జూనియర్‌ ఎన్టీఆర్‌పై బాలీవుడ్ విలన్ ప్రశంసలు

కెరీర్ తొలినాళ్లలో విలన్‌గా నటించి తర్వాత స్టార్ హీరోలుగా ఎదిగిన వారు ఎందరో. రజనీకాంత్, చిరంజీవి, మోహన్ బాబు, శ్రీకాంత్, గోపిచంద్ ఇలా లిస్ట్ చాలానే వుంది.

సందడిగా "చోర్ బజార్" సక్సెస్ మీట్

ఆకాష్ పూరి, గెహనా సిప్పీ హీరో హీరోయిన్లుగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన సినిమా చోర్ బజార్.

Sai Kiran : సభ్యత్వం పేరిట రూ.లక్షలు మోసం .. నిర్మాతపై ఫిర్యాదు చేసిన నువ్వేకావాలి సాయికిరణ్

నువ్వేకావాలి సినిమాలో తరుణ్, రిచాలతో పాటు సమానంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, సింగర్ సాయి కిరణ్‌ను ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు.

Janasena : భావి తరాలను కాపాడుకోవాలంటే జనసేన రావాల్సిందే .. నేనూ కార్యకర్తలా శ్రమిస్తా: నాగబాబు

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేనను పటిష్ట పరిచే పనుల్లో బిజీగా వుంటున్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు.