Janasena: ‘‘ దుల్హన్’’ నిలిపివేత.. ముస్లింలను ముంచారు, జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: జనసేన నేతల ఆగ్రహం

  • IndiaGlitz, [Thursday,June 23 2022]

ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు అర్హంఖాన్. దుల్హన్ పథకం అమలుకి నిధులు లేవని హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంపై ఆయన గురువారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో స్పందించారు. దుల్హన్ పథకానికి రూ.50 వేలు కాదు లక్ష ఇస్తామని చెప్పి .. ఇప్పుడు పూర్తిగా నిలిపి వేయడం ముస్లింలను దగా చేయడమేనని అర్హంఖాన్ దుయ్యబట్టారు. అమలుకాని హామీలు ఇచ్చి ముస్లిం సమాజాన్ని మోసం చేసిన ముఖ్యమంత్రి... వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ముస్లింలను జగన్ మోసం చేశారు:

ముస్లిమ్ మైనారిటీల కష్టాలు దూరం చేసి, వారిని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పిన జగన్ రెడ్డి... ఇవాళ బాధ్యతల నుంచి తప్పించుకున్నారని అర్హంఖాన్ ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో చేసిన వాగ్ధానాలు విస్మరించి ముస్లిం సమాజాన్ని మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అందజేస్తామన్న విద్యా పథకాన్ని కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని అర్హంఖాన్ పేర్కొన్నారు.

50 వేలు కాదు.. లక్ష ఇస్తానన్నారు, ఇప్పుడు మొత్తానికి ఎగనామం:

పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ .. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యిందంటూ మండిపడ్డారు. పాదయాత్ర సమయంలో ముస్లింలకు ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీ కూడా జగన్ రెడ్డి నెరవేర్చలేదని రియాజ్ ఎద్దేవా చేశారు. పేద మైనార్టీ వివాహాలకు అందజేస్తున్న దుల్హన్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిందని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వం రూ.50 వేలు ఇచ్చిందని.. తాము అధికారంలోకి వస్తే రూ లక్ష ఇస్తామని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు పథకాన్ని పూర్తిగా నిలిపివేశారని రియాజ్ మండిపడ్డారు.

హామీలను తుంగలో తొక్కారు:

ముస్లిం నిరుద్యోగ యువత తమ కాళ్ల మీద తాము నిలబడటానికి రూ. 5 లక్షలు రుణం ఇస్తామన్నారని... ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షల బీమా ఇస్తామన్నారు? ఈ మూడేళ్లలో ఏ ఒక్కరికైనా అందించారా అని రియాజ్ మండిపడ్డారు. ఇమాంలకు, మౌల్వీలకు ఇళ్లు కట్టిస్తామని, రూ. 15 వేలు జీతం ఇస్తామని చెప్పారని... ఏ ఒక్కరికైనా ఇళ్లు కట్టించారా? ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారని రియాజ్ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం .. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిందని హైకోర్టులో ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి పిల్ వేసిందని ఆయన గుర్తుచేశారు.

ముఖ్యమంత్రిని నిలదీయండి.. ముస్లింలకు పిలుపు:

దీంతో మా దగ్గర డబ్బులు లేవు, అందుకే పథకాలను అమలు చేయడం లేదని చెప్పడం యావత్తు ముస్లిం సమాజాన్ని మోసం చేయడమేనని రియాజ్ ఫైరయ్యారు. ఇది ప్రభుత్వానికి సిగ్గు చేటని.. ఇప్పటికైనా వైసీపీలో ఉన్న మైనార్టీ నాయకులు బయటకు వచ్చి ముస్లిం సమాజానికి ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రిని నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ నిలదీయని పక్షంలో ముస్లిం సమాజానికి ద్రోహం చేసిన వాళ్లవుతారని రియాజ్ మండిపడ్డారు. అమలు చేయలేని హామీలు ఇచ్చి మోసం చేసిన ఈ ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

More News

Chor Bazar: "చోర్ బజార్" ప్రీ రిలీజ్ వేడుక

ఆకాష్ పురి హీరోగా నటించిన సినిమా చోర్ బజార్.  గెహనా సిప్పీ నాయికగా నటించింది. దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు.

ap inter results 2022 : ఏపీ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్.. కృష్ణా ఫస్ట్‌, కడప లాస్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం విజయవాడలో ఇంటర్‌ ఫస్టియర్‌,

vallabhaneni Vamsi : ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అస్వస్థత .. పంజాబ్‌లో చికిత్స , అక్కడికెందుకు..?

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉన్నత విద్య కోసం పంజాబ్ రాష్ట్రానికి వెళ్లిన వల్లభనేని వంశీ..

Sai Charan : అమెరికాలో విషాదం.. తెలుగు యువకుడిని కాల్చి చంపిన నల్లజాతీయుడు

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయ విద్యార్ధులు అక్కడి ఉన్మాదుల చేతుల్లో దారుణహత్యలకు గురవుతున్నారు.

Akash Puri: పూరీ జగన్నాథ్ దంపతుల విడాకుల వార్తలు... తేల్చేసిన ఆకాశ్ పూరీ

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఆయన సతీమణి లావణ్యలు విడిపోతున్నారంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాతో పాటు పలు వెబ్‌సైట్‌లలో