Janasena party : వూరికో జనసేన లాయర్‌ .. కేసులకు భయపడొద్దు: శ్రేణులకు నాదెండ్ల భరోసా

పోలీసులను వెంటబెట్టుకుని గడప గడపకు తిరిగితే ప్రజా సమస్యలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. నిజాయితీగా ప్రజల ఇళ్లకు వెళ్తే ఈ ప్రభుత్వంతో వారు పడుతున్న ఇబ్బందులేంటో చెబుతారని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు. 151 సీట్లు చాలలేదని.. 175 సీట్లు రావాలని కలలు కంటున్నారని , జగన్ రెడ్డికి ఈసారి 30 సీట్లు వస్తే గొప్పేనంటూ సెటైర్లు వేశారు. మనం నినాదాలకే పరిమితం అయితే సరిపోదని, మన మిత్రులు, సన్నిహితులను పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు.

వూరికో లాయర్‌ని పెట్టాం:

పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బయటికి వస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని... అభద్రతా భావంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. మీ కోసం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక అడ్వకేట్ అందుబాటులో ఉండే విధంగా న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేశారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మిమ్మల్ని ఏ మాత్రం ఇబ్బంది పెట్టినా పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వాలని ఆయన కార్యకర్తలకు తెలియజేశారు. దొంగ కేసులు పెట్టే వారిని ఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధంగా ఉందని.. అవసరం అయితే కోర్టుకి వెళ్లి మీ కోసం నిలబడుతుందని నాదెండ్ల మనోహర్ భరోసా కల్పించారు.

అమలాపురంలో జనసేనపై కుట్ర:

పవన్ కళ్యాణ్ మీద చేసే దుష్ప్రచారాలను నమ్మవద్దుని.. గతంలోనూ ఇలాంటి ప్రచారాలు చేశారని నాదెండ్ల తెలిపారు. ఇప్పుడు అమలాపురంలో పార్టీ మీద అలాంటి కుట్రలు మొదలు పెట్టారని.. అక్కడ జరిగింది ప్రభుత్వ కుట్ర అని ఆయన ఆరోపించారు. కేవలం ఓట్ల కోసం సమాజంలో వర్గాలను చీల్చే కుట్ర పన్నారని, ఒక రాష్ట్ర మంత్రి ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఉంటే తప్పుకుండా పోలీసులకు ముందే సమాచారం ఉంటుందని నాదెండ్ల అన్నారు.

అమలాపురం అల్లర్లపై సీఎం కనీసం స్పందించలేదు:

కాకినాడలో అధికార పార్టీ ఎమ్మెల్యే .. పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు పార్టీ శ్రేణుల మీద దాడులకు పాల్పడినప్పుడు వారిని పరామర్శించేందుకు జిల్లాకు వెళ్తుంటే మొత్తం 144 సెక్షన్ విధించారని మనోహర్ గుర్తుచేశారు. విశాఖ ఎయిర్ పోర్టులోనే పవన్ కళ్యాణ్‌ని ఆపుతారేమో అన్న భావన కలిగించారని ఆయన ఫైరయ్యారు. అలాంటిది మంత్రి, ఎమ్మెల్యే మీద దాడి జరిగితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నుంచి స్పందన లేదని మండిపడ్డారు. దీనిని బట్టి ముఖ్యమంత్రి మనసులో ఎలాంటి దురాశ ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలంటూ కోరారు. జనసేన శ్రేణులు కేవలం ప్రజా సమస్యల మీద మాత్రమే స్పందించాలని... వ్యక్తిగతాలకు పోవద్దని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు.

More News

nayanthara: చెప్పులు ధరించి తిరుమాడ వీధుల్లో షికారు, ఆపై ఫోటో షూట్.. వివాదంలో నయనతార దంపతులు

పెళ్లయిన రెండో రోజే నవ దంపతులు విఘ్నేశ్‌ శివన్‌, నయనతారలు వివాదంలో చిక్కుకున్నారు.

Cordelia Cruise Ship : నడిసంద్రంలో నిలిచిపోయిన వైజాగ్ క్రూయిజ్ షిప్.. ఎందుకిలా..?

సముద్రంలో విహారయాత్రకు వెళ్లాలనుకునే వారి కోసం ఇటీవల విశాఖకు చేరుకుంది లగ్జరీ కార్డీలియా క్రూయిజ్ షిప్.

Manchu Vishnu: మంచు విష్ణు లేటెస్ట్ మూవీకి వివాదాస్పద టైటిల్.. పాకిస్తాన్‌తో లింక్

మంచు వారి పెద్దబ్బాయి మంచు విష్ణు సినిమాల విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే.

pranitha subhash: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత.. ఎమోషనల్ ట్వీట్

ప్రముఖ సినీనటి ప్రణీత తల్లయ్యారు. ఆమె శుక్రవారం సాయంత్రం పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చారు.

Janasena party : ఆయన కుమారుల బాధ్యత పార్టీదే .. కార్యకర్త కుటుంబానికి నాదెండ్ల భరోసా

దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు జనసేన ప్రమాద బీమా చేయించిందన్నారు