ఈ నెల 30న జనసేన విస్తృత స్థాయి సమావేశం

  • IndiaGlitz, [Thursday,December 26 2019]

జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో విస్తృతస్థాయి సమావేశాన్ని ఈ నెల 30న నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు, అమరావతి గ్రామాల ప్రజలు-రైతుల ఆందోళన, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలఆశలు-ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత, జనసేన స్టాండ్, పార్టీ పరంగా నిర్వహించవలసిన కార్యక్రమాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. జనసేన పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ, పార్టీ వ్యూహాత్మక కమిటీ, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ, ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు.

More News

రజనీకాంత్ 'దర్బార్'లో పెళ్లి పాట 'డుమ్ డుమ్' విడుదలైంది

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, స్టార్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి సినిమా 'దర్బార్‌ '.

‘ఆయనకు.. ఉత్తమ కామాంధుడు అనే అవార్డు ఇవ్వండి’

సమాజం కోసం.. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తెరకెక్కించినా.. అలాంటి సినిమాల్లో

'మత్తువదలరా'ను అందరూ ఆదరిస్తున్నారు! - రితేష్‌రానా

మత్తువదలరా చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారాడు దర్శకుడు రితేష్‌రానా.పరిమిత వ్యయంతో , నవ్యమైన కథ, కథనాలతో

దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ ఘటన తర్వాత ఏపీ ప్రభుత్వం అదే పేరుతో ‘దిశ చట్టం’ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇంత రాద్ధాంతమా.. రైతులకు న్యాయం చేస్తాం: ఆర్కే

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటన పెను సంచలనమైంది.