వడ్డీ వ్యాపారం కాదు.. పాలన సంగతి చూడండి : జగన్‌పై నాదెండ్ల మనోహర్ సెటైర్లు

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. గిట్టుబాటు ధరలు రాక... పండిన పంట చేతికొస్తుందో లేదో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో నీటి తీరువా వసూలు విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అప్రజాస్వామికంగా ఉందని మనోహర్ భగ్గుమన్నారు. 2018 నుంచి నీటి తీరువా లెక్కగట్టి 6 శాతం వడ్డీతో రైతుల నుంచి వసూలు చేయడం, కట్టకపోతే రైతు భరోసా ఇవ్వం, భవిష్యత్తులో పంట నష్ట పరిహారానికి అనర్హులను చేస్తామని బెదిరించడాన్ని పరిపాలన అనాలా అంటూ నాదెండ్ల నిలదీశారు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో సిబిఐ దత్తపుత్రుడు జగన్ రెడ్డి పాలన చేస్తున్నాడా? వడ్డీ వ్యాపారం చేస్తున్నాడా అని మండిపడ్డారు.

గత నెలలో ఆస్తి పన్ను కట్టకపోతే ఇళ్లకు తాళాలు వేశారని.. ఇంట్లో సామాను తీసుకుపోతామని బ్యానర్లు కట్టి ట్రాక్టర్లు తిప్పారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఇప్పుడు రైతుల మీద పడ్డారని... నీటి పన్ను పేరుతో వేధింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట కాలువల నిర్వహణకు... కనీసం పూడికతీతకు వైసీపీ ప్రభుత్వం పైసా కూడా ఖర్చుపెట్టలేదని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. స్థానికంగా రైతులే ఆ పనులు చేసుకొంటున్నారని... గ్రామాలవారీగా నీటి పన్ను వసూలు టార్గెట్ పెట్టి మరీ వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రకాశం జిల్లా అన్నసముద్రం అనే చిన్న గ్రామానికి రూ.29 లక్షల నీటి పన్ను వసూలు టార్గెట్ పెట్టారని.. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు వడ్డీతో సహా రాబట్టాలనుకొంటున్నారో ప్రభుత్వం చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు.

రైతుల నుంచి ధాన్యం సేకరించిన మూడు రోజుల్లో ఖాతాలో డబ్బులు వేస్తామని ఊరూరా చెప్పిన సిబిఐ దత్తపుత్రుడు వారాలు, నెలలు గడిచినా డబ్బులు చెల్లించడం లేదని ఎద్దేవా చేశారు. నీటి తీరువాకు వడ్డీ విధిస్తున్న ఈ పాలకులు- రైతులకు ఇవ్వాల్సిన మొత్తానికీ వడ్డీ లెక్కగట్టి చెల్లించాలని మనోహర్ డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రావాల్సిన రూ.7 లక్షల పరిహారాన్ని కూడా 6 శాతం వడ్డీతో చెల్లించాలని నాదెండ్ల మనోహర్ కోరారు. ప్రణాళిక లేకుండా, రైతులపట్ల కనీస బాధ్యత లేకుండా నిర్ణయాలు తీసుకొంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాలనా వైఫల్యం వల్లే 2019 నుంచి ఇప్పటి వరకూ 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకొనే ఉద్దేశం లేని ఈ ప్రభుత్వం .. వసూళ్లు మాత్రం వడ్డీతో సహా వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. వడ్డీ వ్యాపారం విడిచిపెట్టి పరిపాలన చేయాలని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ హితవు పలికారు.

More News

BRS పేరుతో కొత్త జాతీయ పార్టీ.. ప్లీనరీలో కేసీఆర్ సంకేతాలు

జాతీయ రాజకీయాల్లో ఎలాగైనా చక్రం తిప్పాలని భావిస్తోన్న తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ప్రజల దృష్టి మరల్చేందుకే పవన్‌పై విమర్శలు.. టైం చూసి గట్టిగా ఇస్తాం : మంత్రులకు నాగబాబు వార్నింగ్

శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీస్ వ్యవస్థను వై.సీ.పీ. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు

డాక్టర్లు చికిత్స చేస్తారా, అంబులెన్స్‌లు పంపుతారా.. సర్కార్ వైఫల్యంతోనే ఇలా : రుయా ఘటనపై పవన్ ఆవేదన

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చోటు చేసుకున్న ‘‘అంబులెన్స్’’ ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

కేజీఎఫ్ మేకర్స్ చేతుల్లో డా. రాజ్‌కుమార్ మనవడి ఎంట్రీ.. లుక్ వైరల్

‘కేజీఎఫ్ 2’ సూపర్‌హిట్ కావడంతో చిత్రబృందం సక్సెస్ జోష్‌లో వుంది. ‘కేజీఎఫ్’ సిరీస్‌ సృష్టించిన తుఫాన్ వల్ల డైరెక్టర్, నటీనటులతో

తెలంగాణలో కొలువుల జాతర: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల, ఇంటర్వ్యూలు రద్దు.. మెరిట్‌తోనే ఎంపిక

తెలంగాణలో 80,039  ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే.