close
Choose your channels

Janasena: కార్యకర్తల క్షేమం కోసమే పవన్ తపన.. నిరంతరం అదే ఆలోచన : నాదెండ్ల మనోహర్

Friday, June 10, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల క్షేమం గురించి నిరంతరం ఆలోచిస్తూ వుంటారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. దీనిలో భాగంగానే క్రియాశీలక సభ్యులకు ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించారని ఆయన గుర్తుచేశారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో తెనాలికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు పులిగెండ్ల సుబ్రహ్మణ్యం మృతి చెందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తెనాలిలో సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. అనంతరం ఆయన సతీమణి పులిగెండ్ల పార్వతికి రూ.5 లక్షల బీమా అర్థిక సాయం చెక్కును నాదెండ్ల అందజేశారు.

పండుగలా జనసేన కార్యకర్తలకు బీమా పత్రాల పంపిణీ :

ఇకపోతే.. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమా పత్రాలు, సభ్యత్వ కిట్లను అందచేసే కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొందారు. వీరికి రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నారు. ఈ బీమా కోసం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నిధిని సమకూర్చారు. మూడు రోజుల పాటు చేపట్టే బీమా పత్రాలు, కిట్లు పంపిణీ కార్యక్రమ నిర్వహణపై రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు.

సమన్వయకర్తల నియామకం:

‘బీమా పత్రం, పార్టీ అధ్యక్షుల వారి మనోగతాన్ని తెలిపే ప్రతులు, ఐడీ కార్డు, పార్టీ స్టిక్కర్స్, పార్టీ క్యాలెండర్ లాంటి వాటితో కూడిన కిట్ ను ప్రతి క్రియాశీలక సభ్యుడికీ అందజేయాలని నాదెండ్ల మనోహర్ నేతలకు సూచించారు. పార్టీ క్షేత్ర స్థాయి కార్యక్రమాల్లో క్రియాశీలక సభ్యులు కీలకంగా వ్యవహరించేలా నిర్దేశించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కడప, కర్నూలు జిల్లాలకు సమన్వయకర్తలను నియమించారు.

సమన్వయకర్తలు వీరే:

కర్నూలు జిల్లా - బొలిశెట్టి సత్య, నయూబ్ కమాల్, ఆకేపాటి సుభాషిణి
కడప జిల్లా - పి.విజయ్ కుమార్, వడ్రానం మార్కండేయబాబు, పొలసపల్లి సరోజ
శ్రీకాకుళం జిల్లా - బోనబోయిన శ్రీనివాస యాదవ్, ఎ.దుర్గా ప్రశాంతి, తాడి మోహన్
విజయనగరం జిల్లా - పాలవలస యశస్వి, గడసాల అప్పారావు, బేతపూడి విజయశేఖర్
విశాఖపట్నం జిల్లా - చేగొండి సూర్యప్రకాశ్, అమ్మిశెట్టి వాసు, ఘంటసాల వెంకటలక్ష్మి

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.