Janasena Party : కౌలు రైతు భరోసా యాత్ర.. తూ.గో జిల్లాలో రైతు కుటుంబానికి పవన్ పరామర్శ, ఆర్ధిక సాయం

  • IndiaGlitz, [Saturday,July 16 2022]

తూర్పుగోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్రను ప్రారంభించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. దీనిలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, పొట్టిలంకలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు పచ్చిమళ్ల శంకరం కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అనంతరం శంకరం మృతికి గల కారణాలను కుటుంబ సభ్యుల నుంచి తెలుసుకున్నారు. పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని ఆయన భార్యగౌరికి పవన్ కల్యాణ్ అందచేశారు. శంకరం కుటుంబానికి జనసేన తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని పవన్ భరోసా ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పవన్‌కు విమానాశ్రయంలో ఘనస్వాగతం:

అంతకుముందు శనివారం ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. వీర మహిళలు, జనసైనికుల రాకతో మధురపూడి విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అభిమానులు పోటెత్తారు. తనకోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు.

#GoodMorningCMSir క్యాంపెయిన్‌కు మంచి రెస్పాన్స్:

ఇకపోతే... ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్ల దుస్ధితిని తెలుపుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేల్కొలుపుతామంటూ #GoodMorningCMSir పేరిట జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి గుంతలు పడిన ఫోటోలు, వీడియోలను ప్రజలు, జనసేన నేతలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.

More News

Akasavani Vishakapattana Kendram: పాన్ ఇండియా మూవీగా ‘ఆకాశ వాణి విశాఖపట్టణ కేంద్రం’ ... తొలి పాట విడుదల

శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన  హీరోహీరోయిన్లుగా మిథున ఎంట‌ర్‌టైన్‌మెట్స్ ప్రై.లి స‌మ‌ర్ప‌ణ‌లో

క్యూరియాసిటీ పెంచుతున్న విజయ్ ఆంటోనీ 'హత్య' మోషన్ పోస్టర్

తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా 'హత్య'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది.

Janasena : తూర్పు , కోనసీమ జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర.. పవన్‌కు అభిమానుల ఘనస్వాగతం

ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘‘కౌలు రైతు భరోసా యాత్ర’’ను చేపట్టిన సంగతి తెలిసిందే.

Lal Singh Chaddha: చిరంజీవి కోసం ‘‘లాల్ సింగ్ చద్దా’’ స్పెషల్ ప్రివ్యూ.. అమీర్‌తో పాటు స్పెషల్ గెస్ట్‌లు

తన చిత్రాలతో పాటు తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీ కష్టాల్లో వున్నప్పుడు తన వంతు సాయం తప్పకుండా చేస్తారు. ధియేటర్ల ఇబ్బందులు

GoodMorningCMSir : పందుల్ని డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేదా.. స్విమ్మింగ్ పూల్స్‌లా రోడ్లు : జగన్‌పై పవన్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్ల పరిస్ధితిపై మరోసారి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్.