దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - జనసేన అధినేత పవన్

  • IndiaGlitz, [Saturday,December 31 2016]

నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలియ‌చేసారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ...నా త‌రుపున‌, జ‌న‌సేన త‌రుపున దేశ ప్ర‌జ‌లంద‌రికీ 2017 నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. 2016 ఎన్నో క‌ష్టాల‌ను ప్ర‌జ‌ల‌కు చ‌వి చూపించి వెళ్లిపోయింది. క‌రెన్సీ ర‌ద్దు రూపంలో సామాన్యుల‌ను కాటేసింది.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదాను అంద‌ని మావి పండుగా మార్చింది. కానీ 2017 మ‌న రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను సంపూర్తిగా నెర‌వేరుస్తుంద‌ని ఆకాంక్షిస్తున్నాను. మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్ర‌గ‌తి ప‌ధంలో ప‌య‌నించాల‌ని మ‌న‌సారా కోరుకుంటూ జైహింద్ అని అన్నారు.

More News

'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' నాకు బాగా నచ్చింది - దర్శకరత్న డా.దాసరి

‘‘నాన్న నేను నా బాయ్ఫ్రెండ్స్’ సినిమా బాగుందని తెలిసి, ఇటీవల ఈ సినిమా చూశా. నాకు బాగా నచ్చింది. చాలా ట్రెండీగా, అదే టైమ్లో ఫ్యామిలీలకు నచ్చే విధంగా దర్శకుడు సినిమాను బాగా తీశారు.

ఫిబ్ర‌వ‌రిలో కృష్ణ‌వంశీ న‌క్ష‌త్రం

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ  దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై  ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”.

2016 ఉత్తమ కథా నాయికలు (సమీక్ష)

2016కి గుడ్ బై చెబుతూ 2017కి వెల్ కమ్ చెబుతున్న సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన బెస్ట్ ఎంటర్ టైనర్స్, బెస్ట్ ఫర్ ఫార్మెన్స్ (మేల్), వివాదాలు... గురించి తెలుసుకున్నాం కదా..! ఇక ఇప్పుడు 2016లో తమ అందం, అభినయంతో ఆకట్టుకుని బెస్ట్ ఫర్ ఫార్మెన్స్ అందించిన కథానాయికలు గురించి క్లుప్తంగా మీకోసం...

ఎన్టీఆర్ న్యూమూవీ లాంఛ్ డేట్ ఫిక్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సర్ధార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

కొత్త సంవత్సరం లో 'నేనోరకం'

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం. చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.