close
Choose your channels

మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి జనం బయటపడాలి: ఏపీ ప్రజలకు పవన్ దీవాళీ శుభాకాంక్షలు

Thursday, November 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి జనం బయటపడాలి: ఏపీ ప్రజలకు పవన్ దీవాళీ శుభాకాంక్షలు

సామాజిక-ఆర్థిక విధాన నిర్ణయాలపై అమెరికన్ ఆర్థికవేత్త, సామాజిక సిద్ధాంతకర్త థామస్ పోవెల్ చేసిన పోస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘‘తాను వ్యక్తిగతంగా ఎకనామిస్ట్ & సోషల్ థియరిస్ట్ థామస్ సోవెల్‌ను అభినందిస్తున్నాను. ఆయన రచనలను తిరిగి చదువుతూ ఉంటాను. థామస్ పరిశీలనలు చాలా నిజం & అతని లోతైన విశ్లేషణాత్మక పదాలు, 'వాట్ వర్క్స్ & వాట్ సౌండ్స్ గుడ్' . ఆయన సూచించిన సామాజిక-ఆర్థిక విధాన నిర్ణయాలు ఏపీకి కూడా వర్తిస్తాయి అంటూ పవన్ ట్వీట్ చేశారు.

మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి జనం బయటపడాలి: ఏపీ ప్రజలకు పవన్ దీవాళీ శుభాకాంక్షలు

మరోవైపు పవన్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ప్రకృతి వైపరీత్యాలు, మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి ప్రజలు భయటపడాలని.. దీపావళి పండుగ సందర్భాన ఆ ఆదిశక్తిని ప్రార్థిస్తున్నా అన్నారు. దీపం పరబ్రహ్మ స్వరూపమని.. అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేది దీపం అని భావిస్తామన్నారు. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకొనే ఈ పండుగ తరుణాన తన తరపున, తన పార్టీ జనసేన తరపున పవన్ శుభాకాంక్షలు తెలిపారు.

మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి జనం బయటపడాలి: ఏపీ ప్రజలకు పవన్ దీవాళీ శుభాకాంక్షలు

పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఈ దీపాల పండగను జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాంతులను వెదజల్లే దీపాలు, విద్యుల్లతలతో ఇళ్లను అలంకరించుకుందాం. ఎక్కువ లహానికరం కానీ మందుగుండు సామాగ్రితో దీపావళి జరుపుకోవడం సర్వదా శ్రేయస్కరమన్నారు జనసేనాని. ఈ దీపావళిని ఆనందకేళిగా మలుచుకోమని హృదయపూర్వకంగా కోరుతున్నాను అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.