నిత్యం ప్రజలకు సేవ చేయడమే జనసేన చెప్పే థ్యాంక్స్

  • IndiaGlitz, [Sunday,April 21 2019]

మనస్ఫూర్తిగా, నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేయడమే ప్రజలకు మన పార్టీ చెప్పే నిజమైన కృతజ్ఞత అవుతుంని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం దిశగా పని చేయాలని చెప్పారు. రాజ‌కీయాల్లో మార్పు మొద‌లైంది... ఈ ప్ర‌కియను ఇలాగే కొన‌సాగిద్దామని పవన్ పిలుపునిచ్చారు. ఆదివారం మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ త‌రుపున బ‌రిలోకి దిగిన యువ అభ్య‌ర్ధుల‌తో ముఖాముఖి స‌మావేశం అయ్యారు. పోలింగ్ సంద‌ర్బంగా అభ్య‌ర్ధుల‌కు ఎదురైన అనుభ‌వాల‌ను అడిగి తెలుసుకున్నారు.

మార్పు మొదలైంది..

ఎన్నిక‌లు పూర్త‌యిన వెంట‌నే వైసీపీ మాకు 120 స్థానాలు వ‌స్తాయంటే, టీడీపీ మాకు ఇన్ని స్థానాలు వ‌స్తాయంటూ లెక్క‌లు వేయ‌డం మొద‌లుపెట్టాయి, మ‌నం మాత్రం అలా లెక్క‌లు వేయం. ఓటింగ్ స‌ర‌ళి ఎలా జ‌రిగిందో తెలుసుకోమ‌ని మాత్ర‌మే పార్టీ నాయ‌కుల‌కు చెప్పా. మార్పు చిన్న‌గానే మొద‌ల‌వుతుంది. ఇది మ‌నం ఎదిగే దశ. ఈ మార్పు ఎంత వ‌ర‌కు వెళ్తుందో తెలియ‌దు. నేను మిమ్మ‌ల్ని గుర్తించిన విధంగానే మీరు గ్రామ స్థాయి నుంచి నాయ‌కుల్ని గుర్తించండి. నాయ‌కుల్ని త‌యారుచేయండి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా ఇదే మార్పును ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్దాం.

తెలంగాణ‌లో కూడా ఇదే త‌ర‌హా మార్పును ప్ర‌జ‌లు ఆహ్వానిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్య‌మైన విష‌యం మీకు అండ‌గా నిల‌బ‌డిన వారికి, మ‌ద్ద‌తు తెలిపిన వారికి కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డం మాత్రం మ‌రిచిపోవ‌ద్దు. ప్ర‌తి గ్రామానికి ఓ రోజు కేటాయించి అంద‌ర్నీ క‌ల‌వండి. స్థానిక సమ‌స్య‌ల్ని గుర్తించి వాటి మీద బలంగా మాట్లాడండి. వాటి పరిష్కారం కోసం పని చేస్తూ వారికి సేవ చేయడమే నిజమైన కృతజ్ఞత. స‌మ‌స్య పెద్దది అయితే నేను స్పందిస్తాను. నియోజ‌క‌వ‌ర్గాలవారీగా పార్టీ కార్యాల‌యాలు కొన‌సాగించండి. ఆఫీస్ అంటే పెద్ద పెద్ద హంగులు, ఆర్భాటాలు అవ‌స‌రం లేదు. కార్య‌క‌ర్త‌లు కూర్చోవ‌డానికి వీలుగా ఓ రూమ్‌, ప్రెస్ మీట్ పెట్ట‌డానికి ప్లేస్ ఉంటే చాలు. గ్రామ స్థాయిలో స‌మ‌స్య‌ల మీద ఓ ప‌ట్టిక త‌యారు చేసి రెడీగా పెట్టుకోండి అని పవన్ కల్యాణ్ అభ్యర్థులకు సూచించారు.

 

More News

శ్రీలంకలో మారణహోమం వెనుక ఐసిస్ హస్తం!

శ్రీంలక రాజధాని కొలంబోలో జరిగిన ఘటన వెనుక ఉగ్రవాద సంస్థ ఐసిస్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది!.

బుల్లితెర‌పై

ఒకప్పుడు వినోదం అంటే సినిమానే. ఆ తర్వాత అనేక మాధ్యమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ వస్తున్నాయి.

బిగ్‌బాస్ అనుష్క

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్ కార్యక్రమానికి ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో మొదటి బిగ్‌బాస్ షో జరిగిన విషయం తెలిసిందే.

షూటింగ్‌లో గాయపడ్డ విక్కీ

చాలా మంది హీరోలు తమ సినిమాలు సహజంగా ఉండాలని భావిస్తుంటారు. అందుకోసం ఎంత రిస్కయినా తీసుకోవడానికి సిద్ధపడతారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు మంచి రోజులొచ్చాయ్..!

ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తప్పిదాల్ని దిద్దుకుని మళ్లీ గెలుపు బాట పట్టింది.