జనతా గ్యారేజ్ లేటెస్ట్ అప్ డేట్స్...

  • IndiaGlitz, [Saturday,January 16 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన నాన్నకు ప్రేమ‌తో...సంక్రాంతి కానుక‌గా రిలీజై విజ‌య‌వంతంగా ప్రద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి సినిమా జ‌న‌తా గ్యారేజ్ ప్రారంభించ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం సారధి స్టూడియోలో ఓ సెట్ వేసారు. ఫిబ్రవ‌రి 10 నుంచి జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఫిబ్రవ‌రి 17 నుంచి షూటింగ్ లో పాల్గొంటాడ‌ని స‌మాచారం . ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ ని స‌రికొత్త గా చూపించేలా కొర‌టాల శివ విభిన్నమైన క‌థ‌,క‌థ‌నాన్నిరెడీ చేసారు. మైత్రీ మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

మంచు విష్ణు, రాజ్ తరుణ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఎ.కె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

నాని ఆడియోకి అతిథిగా మహేష్..

భలే భలే మగాడివోయ్ సినిమాతో సక్సెస్ సాధించిన యువ హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం క్రిష్ణ గాడి వీర ప్రేమగాథ. ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కించారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.

'ఎక్స్ ప్రెస్ రాజా' మూవీ రివ్యూ

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు వంటి రెండు వరుస విజయాలు తర్వాత శర్వానంద్ నటించిన చిత్రమే ఎక్స్ ప్రెస్ రాజా. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన చిత్రం కూడా ఇదే.

డిక్టేటర్ మూవీ రివ్యూ

సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ సాధించిన నందమూరి బాలకృష్ణ వందవ చిత్రానికి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇలాంటి సందర్భంలో ప్రతి సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయి.

'ఎక్స్ ప్రెస్ రాజా' టీంను ప్రత్యేకంగా అభినందించిన మెగా పవర్ స్టార్ రాంచరణ్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్... హీరో శర్వానంద్ తో పాటు ఎక్స్ ప్రెస్ రాజా చిత్ర టీంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రేపే (జనవరి 14) ఎక్స్ ప్రెస్ రాజా ప్రపంచవ్యాప్తంగా గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.