ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ లేటెస్ట్ అప్ డేట్..

  • IndiaGlitz, [Thursday,May 26 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న‌భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

అయితే...ఈ చిత్రం రేప‌టి నుంచి చెన్నైలో షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్, మ‌రి కొంత మంది ఫైట‌ర్స్ పై యాక్ష‌న్ ఎపిసోడ్ చిత్రీక‌రించ‌నున్నారు. చెన్నై షెడ్యూల్ త‌ర్వాత అన్న‌పూర్ణ స్టూడియోలో ఓ పాట చిత్రీక‌రించ‌నున్నారు. జూన్ నెలాఖ‌రుకి టాకీ పూర్తి చేసి...జులైలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి చేసి.. ఆగ‌ష్టు 12న ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

షూటింగ్ లో గాయపడ్డ విశాల్...

తమిళంలో మరుదు(తెలుగులో రాయుడుగా మే 27న విడుదలవుతుంది)తో సక్సెస్ అందుకున్న విశాల్ సురాజ్ దర్శకత్వంలో కత్తిసన్ డై అనే చిత్రంలో నటిస్తున్నాడు.

సూప‌ర్ స్టార్ బర్త్ డే గిఫ్ట్..

సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన తాజా చిత్రం శ్రీశ్రీ. ఈ చిత్రాన్ని ముప్ప‌ల‌నేని శివ తెర‌కెక్కించారు. ఎస్.బి.ఎస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రభాస్ తో మూవీ ప్లాన్ చేస్తున్న బన్ని డైరెక్టర్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా తెరకెక్కించి బ్లాక్ బష్టర్ సాధించిన సక్సెస్ ఫుల్ బోయపాటి శ్రీను తదుపరి చిత్రాన్ని

ఒక మ‌న‌సు రిలీజ్ డేట్ ఖ‌రారు..

మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న నిహారిక న‌టించిన చిత్రం ఒక మ‌న‌సు. ఈ చిత్రంలో నాగ శౌర్య - నిహారిక జంట‌గా న‌టించారు.

బాబు బంగారం టీజర్ రిలీజ్ డేట్..

విక్టరీ వెంకటేష్-యువ దర్శకుడు మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం బాబు బంగారం.