జ‌న‌తా గ్యారేజ్ మ‌ల‌యాళ వెర్షెన్ ఆడియో రిలీజ్ డేట్..!

  • IndiaGlitz, [Wednesday,August 17 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు. శర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం కోసం ప్ర‌స్తుతం ఓ పాట‌ చిత్రీక‌రిస్తున్నారు.

సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించిన జ‌న‌తా గ్యారేజ్ ఆడియో ఇటీవ‌ల రిలీజైంది. ఇక జ‌న‌తా గ్యారేజ్ మ‌ల‌యాళ వెర్షెన్ ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 26న కొచ్చిన్ లో గ్రాండ్ గా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు. టీజ‌ర్ & ట్రైల‌ర్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న జ‌న‌తా గ్యారేజ్ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

More News

ఆటాడుకుందాం రా ఒక పండ‌గ లాంటి సినిమా - చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు

కాళిదాసు, క‌రెంట్, అడ్డా...చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన లేటెస్ట్ మూవీ ఆటాడుకుందాం రా. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు, ఎ.నాగ సుశీల సంయుక్తంగా నిర్మించారు.

శర్వానంద్ 25వ సినిమా ఓవర్ సీస్ హక్కులను

రన్‌రాజారన్‌, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి కథానాయికగా, ఛత్రపతి, డార్లింగ్‌, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన భా

'ధృవ' టైటిల్ వెనుక ర‌హ‌స్యమ‌దేనా..?

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్న చిత్రం `ధృవ‌`. `మై ఎనిమి ఈజ్ మై స్ట్రెంగ్త్` అనే ట్యాగ్ లైన్‌తో సినిమా రూపొందుతోంది. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ నిర్మాత‌లుగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఆగ‌స్ట్ 15న విడుద‌లైంది.

ఓం న‌మో వేంక‌టేశాయ నాగార్జున ప్రీ లుక్ రిలీజ్..!

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న అధ్యాత్మిక చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

జోఅచ్యుతానంద టీజ‌ర్ రిలీజ్..!

నారా రోహిత్ - నాగ శౌర్య - రెజీనా కాంబినేష‌న్లో అవ‌స‌రాల శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్న చిత్రం జో అచ్యుతానంద‌. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు.