జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ వ‌చ్చేది అప్పుడే..

  • IndiaGlitz, [Friday,May 27 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న‌భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చెన్నైలో షూటింగ్ జ‌రుపుకోనుంది. చెన్నైలోని బిన్నీ మిల్స్ లో ఎన్టీఆర్, మ‌రికొంత మంది ఫైట‌ర్స్ పై యాక్ష‌న్ ఎపిసోడ్స్ చిత్రీక‌రిస్తున్న‌ట్టు స‌మాచారం.

అయితే...జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ ను స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జ‌యంతి రోజైన ఈ నెల 28న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం రేపు జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌డం లేద‌ట‌. రంజాన్ రోజున టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ భారీ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

అఖిల్ బాధ‌ను బ‌య‌ట‌పెట్టిన‌ నితిన్..

అక్కినేని అఖిల్ న‌టించిన తొలి చిత్రం అఖిల్. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో నితిన్ ఈ చిత్రాన్నినిర్మించిన విష‌యం తెలిసిందే. అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న అఖిల్ చిత్రం డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో అఖిల్ రెండో సినిమా విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు.

సునీల్ చేయడం లేదా..?

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్, హీరోగా మారిన తర్వాత కమెడియన్ వేషాలకు బై బై చెప్పేశాడు. అయితే చిరంజీవి హీరోగా వినాయక్ దర్శకత్వంలో రూపొందనున్న కత్తి రీమేక్ కత్తిలాంటోడు(పరిశీలనలో ఉంది) చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి స్నేహితుడు పాత్ర కోసం సునీల్ ను సంప్రదించారట.

ఆ నిర్మాతకు మళ్లీ సూపర్ స్టార్ చాన్స్...

సూపర్ రజనీకాంత్ జూలై 1న కబాలి చిత్రంతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.

లిప్ట్ లో ఇరుక్కున్న బన్ని, బోయపాటి..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సరైనోడు సక్సెస్ సాధించడంతో మొక్కు తీర్చుకునేందుకు సింహాచలం నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు.

మహానటిని రూపొందించనున్న నాని దర్శకుడు

ఇటు ప్రేక్షకులు, విమర్శకులతో ఎవడే సుబ్రమణ్యం వంటి డిఫరెంట్ చిత్రాన్ని తీసి మెప్పు పొందిన దర్శకుడు నాగ అశ్విన్. ఇప్పుడు తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మహానటిగా తనకంటూ ఓ అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్న మహానటి సావిత్రికి పై బయోపిక్ ను తెరకెక్కించబోతున్నాడు.