ఈనెల 14న 'జనతా హోటల్' రిలీజ్

  • IndiaGlitz, [Tuesday,September 04 2018]

వరుస హిట్ చిత్రాలతో నిర్మాతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సురేష్ కొండేటి తాజాగా ఓ ఫీల్ గుడ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో సురేష్ కొండేటి నిర్మిస్తున్న ‘జనతా హోటల్ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 14న వినాయక చవితి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాత సురేష్ కొండేటి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉస్మాద్ హోటల్ అనే సినిమా మలయాళంలో మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. దాన్ని జనతా హోటల్ పేరుతో తెలుగులో తీసుకొస్తున్నాం. కథ-కథనంతో పాటు దుల్కర్, నిత్యామీనన్ల జంట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లవ్, సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే భేదం.. తదితర అంశాల సమాహారంతో రూపొందిన చక్కని ఫీల్‌గుడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. సాహితి రాసిన సంభాషణలు హైలైట్‌గా నిలుస్తాయి. మా సంస్థలో వచ్చిన 'జర్నీ', 'పిజ్జా', 'డా. సలీమ్' చిత్రాలకు ఆయన మంచి సంభాషణలు అందించారు. ఇప్పుడు 'జనతా హోటల్'కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టే గొప్ప చిత్రమిది'' అని చెప్పారు.
 

More News

చ‌ర‌ణ్ షెడ్యూల్ షురూ!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

క‌బ‌డ్డీ ప్లేయ‌ర్‌గా సెన్సేష‌న‌ల్ హీరోయిన్‌....

'ఆర్.ఎక్స్ 100' సినిమాలో లిప్ లాక్‌ల‌తో రెచ్చిపోవ‌డ‌మే కాకుండా పెర్ఫామెన్స్‌తో అద‌ర‌గొట్టిన హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌...

'స‌ర్కార్' చిత్రీక‌ర‌ణ పూర్తి

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న కొత్త చిత్రానికి 'స‌ర్కార్' అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు.

వివాదంలో 'ఆర్‌.ఎక్స్ 100' హీరో సినిమా

ఆర్.ఎక్స్ 100 అనే సినిమాతో స‌క్సెస్ కొట్టిన కార్తికేయ ఇప్పుడు తెలుగు, త‌మిళంలో రూపొంద‌బోయే చిత్రంలోన‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

ర‌ష్మిక‌కు బాలీవుడ్ పిలుపు...

కిర్రిక్ పార్టీ అనే క‌న్న‌డ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక మంద‌న్నా.. త‌ర్వాత 'ఛలో' తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.