Japan:'జపాన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎందులో అంటే..?

  • IndiaGlitz, [Monday,December 04 2023]

తమిళ హీరో కార్తీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. టాలీవుడ్ హీరోల కంటే తెలుగు స్పష్టంగా మాట్లాడటంతో కార్తీకి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఆవారా, యుగానికి ఒక్కడు, ఊపిరి, నా పేరు శివ, ఖైదీ వంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తన 25వ చిత్రం ‘జపాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హైస్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని ‘జోకర్’ సినిమా ఫేమ్ రాజు మురుగన్ డైరెక్ట్ చేశారు. అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.

విడుదలకు ముందు రిలీజ్ అయిన టీజర్‌లో కార్తీ డిఫరెంట్ గెటప్, స్లాంగ్, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకున్నాయి. అయితే విడుదలైన తర్వాత థియేటర్స్‌లో నిరాశపరిచింది. అభిమానుల అంచనాలను ఆందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. డిసెంబర్ 11 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో పేలని జపాన్.. బుల్లి తెరపై ఏమాత్రం ఆకట్టుంకుంటుందో చూడాలి.

ఇక కార్తీ కొత్త సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘వా వాథియారే’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ఖైదీ, సర్దార్ సీక్వెల్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు కోసం తమిళ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More News

Gazette Notification:తెలంగాణ కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్

బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలో రావడంతో తెలంగాణ అసెంబ్లీ రద్దు అయింది. మంత్రివర్గ సిఫార్సు మేరకు రెండో శాసనసభను గవర్నర్‌ తమిళిసై రద్దు చేశారు.

Allu Aravind:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం: అల్లు అరవింద్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Telangana Women MLAs:తెలంగాణ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మహిళా అభ్యర్థులు వీరే..

తెలంగాణ అసెంబ్లీలో ఈసారి మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. ఆదివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో పది మంది మహిళలు గెలిచారు.

CM, Deputy CM:తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క..

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ఎంపిక దాదాపు ఖరారైంది. ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Janasena: హైదరాబాద్‌లో మూసీ నది పాలైన జనసేన, టీడీపీ పరువు

అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడు అన్న చందంగా సొంత రాష్ట్రంలోనే దిక్కు లేదు కానీ వేరే రాష్ట్రంలో పోటీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్.