మే 19న 'జట్టు ఇంజనీర్ ' ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Friday,April 21 2017]

హింద్ కా నాప‌క్ కో జ‌వాబ్ వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత సెయింట్ డా.గుర్‌మీత్ రామ్ ర‌హీం సింగ్ ఇన్‌సాన్‌(డా.ఎం.ఎస్‌.జి) 'జ‌ట్టు ఇంజ‌నీర్‌' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకురానున్నారు. సోష‌ల్ మెసేజ్‌తో కూడిన కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌గా 'జట్టు ఇంజ‌నీరింగ్‌'. డా.ఎం.ఎస్‌.జి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా 'జ‌ట్టు ఇంజ‌నీర్‌' ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.
ఎం.ఎస్‌.జి సిరీస్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద్వ‌యం డా.ఎం.ఎస్‌.జి, ఆయ‌న కుమార్తె హ‌నీ ప్రీత్ ఇన్‌సాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌చేశారు. పేద‌రికం, నిరుద్యోగం, డ్ర‌గ్స్ త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో కొట్టు మిట్టాడే గ్రామాన్ని ఓ ఉపాధ్యాయుడు ఎలా మార్చి ప్ర‌జ‌ల్లో ఎలాంటి మార్పు తెచ్చాడ‌నేదే క‌థ‌. ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర‌మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ స్వ‌చ్చ్ భార‌త్ మిష‌న్‌కు సంబంధించిన అంశాల‌ను కూడా ఈ సినిమాలో చూపిస్తున్నారు.
ఈ చిత్రంలో హ్యుమ‌ర్‌తోపాటు ఎమోష‌న్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉంటుందని చిత్ర ద‌ర్శ‌కురాలు హ‌నీ ప్రీత్ ఇన్‌సాన్ తెలిపారు. ఈ చిత్రాన్ని 15రోజుల్లోనే చిత్రీక‌రించ‌డం విశేషం. డా.ఎం.ఎస్‌.జి న‌టిస్తున్న మ‌రో చిత్రం ఎం.ఎస్‌.జి ఆన్‌లైన్ గురుకుల్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ ఏడాది చివ‌ర్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సినిమాలో రెండు పాట‌లుంటాయి. అందులో ఒక‌టి స్పోర్ట్స్‌కు సంబంధించి ఉంటుంది. ఈ రెండు సాంగ్స్‌ను డా.సెయింట్ డా.ఎం.ఎస్‌.జి కంపోజ్ చేసి పాడ‌టం విశేషం.

More News

జూన్ 23న వరల్డ్ వైడ్ గా నాని, దానయ్య డి.వి.వి. చిత్రం 'నిన్ను కోరి'

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్.ఎల్.పి.పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్ను కోరి'.

కీర్తిసురేష్ తో సీనియర్ యాక్టర్ రొమాన్స్....

తెలుగు,తమిళ ప్రేక్షకులకు దగ్గరైన స్టార్ హీరోయిన్ ఇప్పుడు బిజి బిజీగా ఉంది.

విజయ్ దేవరకొండ, పరశురాం జిఏ2 చిత్రం ప్రారంభం

వరుస సూపర్హిట్ చిత్రాల తరువాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నివాసు నిర్మాతగా జిఏ2 బ్యానర్ లో పరుశురాం దర్శకత్వంలో, `పెళ్ళిచూపులు` ఫేం విజయ్ దేవరకొండ హీరొగా చిత్రం ఈ రోజు మాస్టర్ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వగా పూజాకార్యక్రమాలు జరుపుకుంది

రవితేజకు విలన్ అవుతున్న బాలీవుడ్ యాక్టర్...

మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్సిరికొండ దర్శకత్వంలో `టచ్చేసి చూడు`.ఈ సినిమా ఇప్పటికీ మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో పాటు రవితేజ అనిల్ రావిపూడి దర్శకత్వంలో `రాజా ది గ్రేట్` సినిమాలో నటిస్తున్నాడు.

రజనీ సినిమాపై వస్తున్న రూమర్స్ ను ఖండించిన దర్శకుడు...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో తదుపరి సినిమా రూపొందనుంది.