'దేశవాళి వినోదం' పంచే 'జయమ్ము నిశ్చయమ్మురా' సమైక్యంగా నవ్వుకుందాం రండి!

  • IndiaGlitz, [Thursday,October 06 2016]

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన సినిమాలను-సకుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ సినిమాలుగా పేర్కొంటుంటారు. కానీ.. 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమా దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి మాత్రం 'సమైక్యంగా నవ్వుకుందాం' అంటున్నారు. అలాగే తన సినిమాలో తాను పండించిన వినోదానికి 'దేశవాళి వినోదం' అనే నామకరణం చేసి అందరి దృష్ఠినీ విశేషంగా ఆకర్షిస్తున్నారాయన. ఇక రీరికార్డింగ్ అవ్వకుండానే ఈ సినిమా రష్ చూసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్- శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో- తన స్వంత నిర్మాణ సంస్థ 'సుకుమార్ రేటింగ్స్' పతాకం పై సినిమా ప్రకటించడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

'శ్రీనివాసరెడ్డి -పూర్ణ జంటగా శివరాజ్ ఫిలింస్ పతాకంపై ఏ.వి.ఎస్.రాజు సమర్పణలో శివరాజ్ కనుమూరి స్వీయనిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా'. సాంగ్ టీజర్ ను సుకుమార్ విడుదల చేసారు. ఈ సినిమా రష్ చూసి తాను స్పిల్ బౌండ్ అయ్యానని ఈ సందర్భంగా సుకుమార్ అన్నారు. శివరాజ్ మా మట్టపర్రు (సుకుమార్ స్వస్థలం)కుర్రాడని చెప్పుకోవడానికి చాల గర్వపడుతున్నానని అయన పేర్కొన్నారు.'జయమ్ము నిశ్చయమ్మురా' నా కెరీర్ కు గొప్ప టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని శ్రీనివాస్ రెడ్డి తెలుపగా - ఈ సినిమా విడుదలయ్యాక తనను అందరూ 'జయమ్ము నిశ్చయమ్మురా' పూర్ణ అంటారని హీరోయిన్ పూర్ణ పేర్కొన్నారు. రవిచంద్రన్ కార్తీక్ తీర్చిదిద్దిన 'ఓ సారి ఇటు చూడవే' పాటకు అద్భుతమైన స్పందన వస్తోందని, ఓ మళయాళ గీతం ప్రేరణతో ఈ పాటకు వారు ప్రాణం పోశారని దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి అన్నారు. సుకుమార్ గారి ప్రేరణతో ఈ చిత్రాన్ని తాను నిర్మించానని, సినిమా రష్ చూసిన ఆయన అందరికీ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెబుతుండడంతో పాజిటివ్ బజ్ ఏర్పడిందని శివరాజ్ తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఈ చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు, రవివర్మ, సినిమాటోగ్రాఫర్ నగేష్, ఎడిటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

More News

కత్తి కంటే కలం ఎంత గొప్పదో నిరూపించే సినిమా ఇజం - ఎన్టీఆర్

డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్నపవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇజం.ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై

నిన్న జగపతి - నేడు రానా..!

జురాసిక్ పార్క్ ,జాస్,ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిల్ బర్గ్ దర్శకత్వం లో రూపొందిన అద్భుతమైన ఫాంటసి ది బి ఎఫ్ జి(ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్)చిత్రంలో

ప్రేమమ్ కి త్రివిక్రమ్ చేసినసాయం ఇదే..!

అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమమ్.

వైశాఖంలో స్వ‌చ్ఛ భార‌త్

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి, దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ దాదాపు పూర్తవుతుంది.

స‌మంత‌తో ప్రేమ విష‌యం నాన్న‌కు చెప్పిన‌ప్పుడు ఫ‌స్ట్ రియాక్ష‌న్ అదే..! - నాగ‌ చైత‌న్య‌

ఏమాయ చేసావే, 100% ల‌వ్, ఒక లైలా కోసం...ఇలా విభిన్న ప్రేమ‌క‌థా చిత్రాల్లో న‌టించి మెప్పించ‌ని అక్కినేని అంద‌గాడు నాగచైత‌న్య న‌టించిన‌ తాజా చిత్రం ప్రేమ‌మ్. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ఈ ప్రేమ‌మ్ చిత్రాన్ని తెర‌కెక్కించారు.