JD Chakravarthy:జేడీ చక్రవర్తికి ఇంటర్నేషనల్ అవార్డ్.. కెరీర్‌లో తొలిసారి, ఎక్కడికెళ్లినా ఆ సినిమా గురించే

  • IndiaGlitz, [Wednesday,May 03 2023]

జేడీ చక్రవర్తి.. ఈ పేరు తెలియని తెలుగువారుండరు. రామ్‌గోపాల్ వర్మ శిష్యుల్లో ఆయన కూడా ఒకరు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, సింగర్‌గా, నిర్మాతగా ఇలా అన్ని రంగాల్లో తనదైన సత్తా చాటిన వ్యక్తి. అప్పట్లో జేడీ చక్రవర్తికి అమ్మాయిల్లో మంచి క్రేజ్ వుండేది. అయితే ఆ క్రేజ్‌ను ఆయన నిలబెట్టుకోలేకపోయారనే వాదన వుంది. వయసు పెరుగుతున్నా జేడీ అందం మాత్రం తగ్గడం లేదు. నేటికీ అదే చార్మింగ్ ఆయన సొంతం.

ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జేడీకి అవార్డ్:

ఇదిలావుండగా.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో టాలీవుడ్ సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ నేపథ్యంలో పలు తెలుగు సినిమాలు, నటులకు గుర్తింపు దక్కడం మొదలైంది. తాజాగా ఈ లిస్ట్‌లో జేడీ చక్రవర్తి చేరారు. నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జేడీ చక్రవర్తికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో అవార్డ్ వచ్చింది. ‘‘దహిణి ది విచ్’’ అనే సినిమాలో నటనకు గాను జేడీకి ఈ పురస్కారం దక్కింది. దీంతో జేడీ చక్రవర్తి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. తెలుగు, హిందీ, మ‌ల‌యాళం, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో జె.డి.చ‌క్ర‌వ‌ర్తి 80కి పైగా సినిమాల్లో న‌టించారు. కెరీర్‌లో స్క్రీన్ అవార్డ్‌, నంది అవార్డుల‌ను గెలుచుకున్న ఆయ‌నకు ఇదే తొలి ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్‌.

దహిణి ది విచ్‌కు 18 అంతర్జాతీయ అవార్డ్‌లు :

దహిణి ది విచ్‌కు గతంలో ఆస్ట్రేలియాలోనూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డ్ దక్కింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 18 అంతర్జాతీయ అవార్డ్‌లు వచ్చాయి. వీటిలో ఆస్ట్రేలియా టైటాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌ అవార్డులు వున్నాయి. అలాగే స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా నామినేట్ అయ్యింది. ఈ మూవీకి రాజీవ్ టచ్ రివర్ దర్శకత్వం వహించగా.. సునీతా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు. తనిష్ట ఛటర్జీ, జేడీ చక్రవర్తి, శృతి జయన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మంత్రగత్తెల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఈ సినిమాను పూర్తిగా చిత్రీకరించారు. దీంతో ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ పాయింట్‌ను వెలుగులోకి తెచ్చిన‌ట్ట‌య్యింది.

సామాజిక కార్యకర్త పాత్రలో ఒదిగిపోయిన జేడీ చక్రవర్తి:

ఈ చిత్రంతో ప్ర‌తాప్ బాబు అనే సామాజిక కార్య‌కర్త‌గా జేడీ చక్రవర్తి క‌నిపించారు. స‌మాజంలో మంచి కోసం నిరంతం పోరాడే పాత్ర‌లో ఆయన ఒదిగిపోయారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి పెర్ఫామెన్స్‌ని జ్యూరీ ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించింది. అంత‌ర్జాతీయ స్థాయి న‌టులు ఓలే ఓజో, ష‌ఫీ బెల్లో వంటి వారితో చ‌క్ర‌వ‌ర్తిని వేదిక‌ను పంచుకున్నారు.

More News

Geoffrey Hinton:కృత్రిమ మేధతో జాగ్రత్త.. ప్రపంచానికి చెప్పాలని గూగుల్‌లో ఉద్యోగానికి ‘‘గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ’’ గుడ్‌బై

శాస్త్ర , సాంకేతిక రంగాలు ప్రస్తుతం కొత్తపుంతలు తొక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ రోజుకారోజు కొత్త కొత్త సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌లు , ఎన్నో సాధనాలు పుట్టుకొస్తున్నాయి.

Vimanam:'విమానం' సినిమా నుంచి 'రేలా రేలా' లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

ఓ చిన్న కుర్రాడు..అత‌నికి విమానం ఎక్కాల‌ని ఎంతో ఆశ‌.. కానీ ఎలా? ఎప్పుడు విమానాన్ని చూసినా అలా ఆనందం, ఆశ్చ‌ర్యంతో చూస్తూనే ఉండిపోతాడు.

DK Shivakumar:హెలికాఫ్టర్‌ను ఢీకొన్న పక్షి.. డీకే శివకుమార్‌కు తప్పిన పెను ప్రమాదం, ప్రజల ఆశీర్వాదం వల్లేనన్న కేపీసీసీ చీఫ్

కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను పక్షి ఢీకొట్టింది.

The Story Of A Beautiful Girl:'ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్' మే 12న రిలీజ్

ఎన్నో వైవిధ్యమైన కథలకు తెరలేపిన తెలుగు ఇండస్ట్రి మరో వినుత్నమైన కథతో ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది.

Venkaiah Naidu:బెజవాడ ‘‘పాక ఇడ్లీ’’ తిన్న వెంకయ్య నాయుడు.. గన్నవరం నుంచి పత్యేకంగా విజయవాడకి, షాకైన హోటల్ ఓనర్

భారతదేశం భిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత. వేష భాషలు, సాంప్రదాయాలు  వేరు వేరుగా వుంటాయి.