వైకల్యాన్ని జయించిన వీరుడు పొట్టి వీరయ్య - రాజశేఖర్, జీవిత దంపతులు

  • IndiaGlitz, [Monday,April 26 2021]

తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అరుదైన నటుడిని కోల్పోయింది. పొట్టి వీరయ్యగా ప్రేక్షకులకు తెలిసిన గట్టు వీరయ్య ఆదివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం విధితమే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 500లకు పైగా సినిమాల్లో నటించిన వీరయ్యకు ప్రముఖ కథానాయకుడు రాజశేఖర్, జీవిత దంపతులు నివాళులు అర్పించారు. చిత్రపురి కాలనీకి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు. వీరయ్యతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

రాజశేఖర్, జీవిత దంపతులు మాట్లాడుతూ వీరయ్యగారు తెలియని వాళ్ళు లేరు. అగ్ర హీరోలు అందరితోనూ నటించారు. మాతోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. మాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన వైకల్యాన్ని జయించిన వీరుడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) జనరల్ బాడీ మీటింగ్స్ కానివ్వండి, అవార్డు ఫంక్షన్స్ కానివ్వండి...ఏ కార్యక్రమానికి పిలిచినా సరే తప్పకుండా హాజరు అయ్యేవారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. మేం పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పరిశ్రమలో ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉన్నారు. ఆయన మరణం బాధ కలిగించింది. ఆ కుటుంబానికి మాకు వీలైనంత సహాయం చేయాలని అనుకుంటున్నాం అని అన్నారు.

More News

‘నో మ్యాడ్ ల్యాండ్’కు 3 ఆస్కార్ అవార్డులు.. సినిమా కథ ఏంటంటే..

సినీ రంగంలో ఎంతో గొప్పగా భావించే ఆస్కార్‌ 93వ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నిర్వాహకులు

అల్లు అర్జున్‌పై ప్రశంసల జల్లు కురిపించిన సల్మాన్

స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది.

భారత్‌కు రూ.135 కోట్ల విరాళాన్ని ప్రకటించిన గూగుల్

కరోనా మహమ్మారి దేశంలో ఊహించని విధంగా విస్తరిస్తోంది. సెకండ్ వేవ్ విస్తరణ వేగం అధికంగా ఉండటంతో రోజుకు లక్షల్లో జనాభా కరోనా బారిన పడుతున్నారు.

కోవిడ్ ఆసుపత్రిలో ప్రమాదం.. 82 మంది మృతి

కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రమాదాలు మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు జనాలు కోవిడ్ కారణంగా మరణిస్తూ ఉంటే.. మరోవైపు ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.

అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ సందడి

ప్రపంచ సినీ రంగంలో ఎంతో గొప్పగా భావించే ఆస్కార్‌ 93వ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది.