close
Choose your channels

రాజ‌శేఖ‌ర్‌ను డైరెక్ట్ చేయ‌నున్న జీవిత‌....

Tuesday, February 2, 2021 • తెలుగు Comments

రాజ‌శేఖ‌ర్‌ను డైరెక్ట్ చేయ‌నున్న జీవిత‌....

సినీ రంగానికి చెందినవాళ్ల‌కి, సినీ ప్రేక్ష‌కాభిమానుల‌కు జీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంప‌తులు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వీరిలో రాజ‌శేఖ‌ర్ హీరోగా కొనసాగుతుంటే.. జీవిత మాత్రం న‌టి నుంచి ద‌ర్శ‌కురాలిగా మారింది. అప్పుడెప్పుడో భ‌ర్త రాజ‌శేఖ‌ర్‌ను డైరెక్ట్ చేసిన జీవిత‌, త్వ‌ర‌లోనే మ‌రోసారి రాజ‌శేఖ‌ర్‌ను డైరెక్ట్ చేయ‌బోతుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. మల‌యాళంలో విజ‌య‌వంత‌మైన జోసెఫ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని రాజ‌శేఖ‌రే నిర్మించాల‌నుకున్నాడు. ఈ స్క్రిప్ట్‌పై డైరెక్ట‌ర్ నీలకంఠ వ‌ర్క్ చేశారు. అయితే త‌ర్వాత క్రియేటివ్ డిఫ‌రెన్‌సెస్ రావ‌డంతో నీల‌కంఠ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నార‌ని టాక్‌. దీంతో జీవిత‌నే ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుందంటున్నారు.

ఇటీవ‌ల కోవిడ్ బారిన ప‌డ్డ హీరో రాజ‌శేఖ‌ర్‌.. అప్ప‌టి నుంచి పూర్తి రెస్ట్‌లోనే ఉన్నాడు. అన్ని స‌క్ర‌మంగా కుదిరితే, ఈ ఏడాదిలోనే రాజ‌శేఖ‌ర్ హీరోగా జీవిత ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను మ‌నం చూడొచ్చు. వీరిద్దరి కాంబినేషన్‌లో శేషు, ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, మహంకాళి చిత్రాలు రూపొందాయి.

Get Breaking News Alerts From IndiaGlitz